Maruti Dzire Interior First Look: వావ్.. మారుతి కొత్త డిజైర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఈలేస్తారు!

Maruti Dzire Interior First Look: మారుతి సుజుకి నంబర్-1 సెడాన్ డిజైర్ కొత్త వేరియంట్ త్వరలో విడుదల కానుంది. నవంబర్ 11న కంపెనీ దీన్ని లాంచ్ చేయనుంది. అయితే తాజాగా డీలర్ యార్డ్ ‌నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. దీని ఇంటీరియర్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. లీక్ అయిన కొత్త ఫోటోల ప్రకారం డిజైర్ టాప్ వేరియంట్ అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో డిజైర్ హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

కొత్త మారుతి డిజైర్ రోడ్లపై గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తుంది. ముందు భాగం దాదాపు పూర్తిగా కొత్తది. కొత్త ఎలిజెంట్ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద స్లాటెడ్ గ్రిల్, పాలీగోనల్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ఇందులో చూడవచ్చు. సుజుకి లోగో పొజిషనింగ్ అలాగే ఉంది. అయితే ఇది స్పోర్టియర్ ఫ్రంట్ ఫాసియాతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బానెట్‌పై అప్‌డేటెడ్ క్యారెక్టర్ లైన్‌లను కూడా చూడవచ్చు.

ఇది ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్-అవుట్ బి పిల్లర్, క్రోమ్ విండో గార్నిష్‌తో మునుపటి మాదిరిగానే బాడీ-కలర్డ్ ఓఆర్‌వీఎమ్‌లను కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది కొత్త అల్లాయ్ వీల్స్‌ను పొందనుంది. మారుతి అల్లాయ్ వీల్స్ కోసం బ్యాలెన్స్‌డ్ డిజైన్‌ను ఎంచుకుంది. వెనుక వైపున డిజైర్ కొత్త టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్‌తో ఇంటర్‌కనెక్టింగ్ పియానో ​​బ్లాక్ స్ట్రిప్‌ను పొందింది.

కొత్త డిజైర్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే ఇది కొత్త స్విఫ్ట్‌తో కనిపించే 9 అంగుళాల యూనిట్ కంటే పెద్దదిగా కనిపించే ఒక ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. మారుతి స్విఫ్ట్‌తో అందుబాటులో లేని అనేక అదనపు ఫీచర్లను కొత్త డిజైర్‌లో చూడొచ్చు. కొత్త డిజైర్ టాప్ వేరియంట్‌‌లో సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ ఉంటుంది. ఇది సెగ్మెంట్-మొదటి ఫీచర్ అవుతుంది. ఇది సెడాన్ మార్కెట్‌ను గణనీయంగా పెంచుతుంది.

కొత్త మారుతి డిజైర్ స్విఫ్ట్‌లో ఉపయోగించిన అదే 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్‌తో దీనిలో ఉపయోగించారు. పనితీరు, ఇంధన సామర్థ్య సమతుల్యతను అందిస్తూ ఇంజన్ 81.58 పీఎస్ పవర్,  111.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5ఎమ్‌టీ, 5ఏఎమ్‌టీ ఉన్నాయి. స్విఫ్ట్ ఇంధన సామర్థ్యం మాన్యువల్‌తో 24.80 కిమీ, ఆటోమేటిక్‌తో 25.75 కిమీ. స్విఫ్ట్ మాదిరిగానే కొత్త డిజైర్‌తో పాటు సీఎన్‌జీ ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది.

సేఫ్టీ కిట్ గురించి మాట్లాడితే ఇది స్టాండర్డ్‌గా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. భారతదేశంలోని ఎన్‌క్యాప్ పరీక్షలో కొత్త స్విఫ్ట్, డిజైర్ ఎలా పనిచేస్తుందో చూడాలి. కొత్త 2024 స్విఫ్ట్ జపాన్ ఎన్‌క్యాప్‌లో 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది. కానీ కొత్త స్విఫ్ట్ యూరో ఎన్‌సిఎపిలో 3 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.