Site icon Prime9

2025 Low Price Bikes: 110కిమీ కంటే ఎక్కువ మైలేజ్.. తక్కువ బడ్జెట్‌లో మీరు మెచ్చే బైక్స్..!

2025 Low Price Bikes

2025 Low Price Bikes

2025 Low Price Bikes: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. సంవత్సరం ప్రారంభంలో మీరు రోజువారీ ఉపయోగం కోసం సరసమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మార్కెట్లో చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అయితే ఇక్కడ 110కిమీ కంటే ఎక్కువ మైలేజీనిచ్చే 5 చవకైన బైక్‌లు ఉన్నాయి. వీటి ధర రూ. 39,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ జాబితాలో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్, హోండా బైక్‌లు ఉన్నాయి.

Tvs Sport
టీవీఎస్ స్పోర్ట్ 100సీసీ బైక్ సెగ్మెంట్‌లో సరసమైన బైక్. ఇందులో 110 ఇంజన్ ఉంటుంది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం టీవీఎస్ స్పోర్ట్ 110.12 మైలేజీని సాధించడం ద్వారా కొత్త మైలేజ్ రికార్డును సృష్టించింది. డ్రమ్ బ్రేకులు దీని ముందు, వెనుక టైర్లలో అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ గురించి మాట్లాడితే మీరు బైక్‌లో 110cc ఇంజన్‌ని పొందుతారు, ఇది 8.29 పిఎస్ పవర్,  8.7ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4 స్పీడ్ గేర్‌బాక్స్ కలదు. ఇందులో అమర్చిన ET-Fi టెక్నాలజీ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. బైక్‌లో 10 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఢిల్లీలో స్పోర్ట్ ఎక్స్-షో రూమ్ ధర రూ.59 వేల నుండి ప్రారంభమవుతుంది.

Honda Shone 100
హోండా షైన్ 110 రోజువారీ వినియోగానికి మంచి బైక్. ఈ బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.64900. ఈ బైక్‌లో 98.98 సీసీ ఇంజన్ ఉంది. ఈ బైక్ మైలేజ్ లీటరుకు 65 కిలోమీటర్లు. బ్రేకింగ్,  సౌకర్యం ఆధారంగా షైన్‌ నచ్చుతుంది. దీని సరళమైన డిజైన్ కారణంగా, అన్ని వయసుల వారు ఈ బైక్‌ను సులభంగా నడపచ్చు. దీని సీటు పొడవుగా, మృదువుగా ఉంటుంది. 70-80kmph వేగంతో ఈ బైక్‌ను నడపవచ్చు.

Hero HF100
హీరో మోటోకార్ప్  HF100 నమ్మదగిన బైక్. ఈ బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.59000. ఇప్పటి వరకు హీరోకి ఇదే అత్యంత చవకైన బైక్. ఇది రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ బైక్‌లో 100 సీసీ ఇంజన్ ఉంది. రోజువారీ ఉపయోగం కోసం ఇది మంచి బైక్. ఈ బైక్ మైలేజ్ లీటరుకు దాదాపు 70 కిలోమీటర్లు. ఈ బైక్ సీటు ఖచ్చితంగా మెత్తగా ఉంటుంది కానీ పొడవుగా లేనందున ఇద్దరు వ్యక్తులు సులభంగా కూర్చోలేరు. అయితే ఇది తక్కువ ధరకే లభించే బైక్.

Bajaj CT110X
మీరు బజాజ్ ఆటో అభిమాని అయితే CT 110X బైక్ మీకు మంచి ఎంపిక. ఇందులో 115.45 సీసీ ఇంజన్ కలదు. ఈ బైక్ మైలేజీ కూడా లీటరుకు దాదాపు 70 కిలోమీటర్లు. పటిష్టమైన పనితీరుతో పాటు అధిక మైలేజీని కోరుకునే రైడర్ల కోసం బజాజ్ ఈ బైక్‌ను రూపొందించింది. ఈ బైక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.69 వేలు.

TVS XL 100
మీరు రోజువారీ ఉపయోగం కోసం తక్కువ ధర, డ్రైవింగ్ చేయడానికి సులభమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే TVS XL మీకు మంచి ఎంపికగా ఉంటుంది. మీరు దీన్ని వ్యక్తిగతంగా, మీ చిన్న వ్యాపారం కోసం ఉపయోగించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో TVS XL100 ధర రూ. 39900 నుండి ప్రారంభమవుతుంది, ఈ బైక్‌లో 99.7 cc 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 4.3 బిహెచ్‌పి, 6.5 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ARAI ప్రకారం ఈ బైక్ 80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని పేలోడ్ 130 కిలోలు. XL 100 ద్వారా, కంపెనీ ఎకనామిక్ , యుటిలిటీ టూ-వీలర్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుంది. దీని తక్కువ బరువు కారణంగా, మీరు అధిక ట్రాఫిక్‌లో కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

Exit mobile version