Site icon Prime9

Upcoming Cars: మంచి హైబ్రిడ్ కార్ కొనాలా? టాప్-3 అప్‌‌కమింగ్ మోడల్స్ ఇవే! ఈసారి టాప్ లేచిపోద్ది!

Upcoming Cars

Upcoming Cars: భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ మధ్య, హైబ్రిడ్ మోడల్‌లు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. హైబ్రిడ్ కార్లలో, పెట్రోల్, డీజిల్ రన్ మోడళ్లతో పోలిస్తే కస్టమర్లు మెరుగైన మైలేజీని అందిస్తాయి. అయితే, భారతీయ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్లో లిమిటెడ్ హైబ్రిడ్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చాలా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రానున్న రోజుల్లో తమ కొత్త హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటువంటి రాబోయే 3 హైబ్రిడ్ మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Mahindra XUV3XO Hybrid
మహీంద్రా తన ప్రసిద్ధ ఎస్‌యూవీ XUV3XO కోసం హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నల్ కోడ్‌నేమ్ S226తో ఈ SUV భారతీయ మార్కెట్లో బ్రాండ్ మొదటి హైబ్రిడ్ మోడల్ అవుతుంది. మహీంద్రా XUV3XO హైబ్రిడ్ వచ్చే ఏడాది అంటే 2026లో రోడ్లపై చూడవచ్చు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. XUV3XO బలమైన హైబ్రిడ్ సెటప్‌తో 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది.

Hyundai 7-Seater Hybrid SUV
హ్యుందాయ్ కొత్త హైబ్రిడ్ 7-సీటర్ SUV కోసం పని చేస్తోంది. ఈ కారు 2027 నాటికి భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఇంటర్నల్ కోడ్ నేమ్ Ni1i. హైబ్రిడ్ SUV బ్రాండ్  లైనప్‌లో అల్కాజార్ పైన ఉంటుంది. రాబోయే ఎస్‌యూవీ మార్కెట్లో మహీంద్రా XUV700, టాటా సఫారీ వంటి కార్లతో పోటీ పడుతుందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.

Maruti Suzuki 7-Seater Hybrid
మారుతి సుజుకి 2025 చివరి నాటికి గ్రాండ్ విటారా ఆధారంగా కొత్త 7-సీటర్ హైబ్రిడ్ SUVని పరిచయం చేస్తుంది. Y17 అంతర్గత కోడ్‌నేమ్‌తో ఉన్న ఈ SUV ఇటీవల టెస్టింగ్ సమయంలో గుర్తించారు. SUVలో 1.5-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ పవర్‌ట్రెయిన్‌గా ఉపయోగిస్తారు.

Exit mobile version