2025 Toyota Urban Cruiser Hyryder: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా అవతరించింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల ఈ ఎస్‌యూవీ భద్రతను మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసి విడుదల చేసింది. కస్టమర్ల డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని కొత్త మార్పులతో ప్రవేశపెట్టినట్లు టయోటా తెలిపింది.
2025 Toyota Urban Cruiser Hyryder Price
2021లో ప్రారంభించిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్, భారతదేశంలో ఇప్పటికే 1 లక్ష కార్లను విక్రయించింది. మెరుగైన ఫీచర్ అప్‌డేట్‌లతో విడుదల చేసిన ఈ కారు ధర రూ. 11.34 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కొత్త ఫీచర్ అప్‌డేట్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
2025 Toyota Urban Cruiser Hyryder Features & Specifications
మెరుగైన భద్రత కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేశారు. అదనపు సౌలభ్యం, భద్రత కోసం కొన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ జోడించారు. డ్రైవింగ్ పొజిషన్ కోసం 8-వే అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీటు ఇప్పుడు టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మెరుగైన పనితీరు కోసం, మునుపటి AWD 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఆల్-వీల్ డ్రైవ్‌తో కూడిన కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (6AT) వేరియంట్‌తో భర్తీ చేశారు. చాలా వేరియంట్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. టాప్ వేరియంట్లలో యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది.
టాప్ వేరియంట్లలో డ్రైవర్, కో-డ్రైవర్ కోసం వెంటిలేటెడ్ సీట్లు, టైప్-C USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు (15W), ఎల్ఈడీ స్పాట్, రీడింగ్ ల్యాంప్‌లు ఇప్పుడు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభిస్తాయి. ఎంపిక చేసిన వేరియంట్లకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డిస్‌ప్లో కూడా జోడించారు. స్టైలింగ్ ఎంపికలను పెంచడానికి ఎంపిక చేసిన వేరియంట్లలో డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లు ప్రవేశపెట్టారు.
మైలేజ్, పనితీరు కోసం నియో డ్రైవ్ (ISG)తో కూడిన 1.5L K-సిరీస్ ఇంజిన్, 2WD, 4WD ఎంపికలతో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, సెల్ఫ్-ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉన్నాయి. ప్రీమియం క్యాబిన్‌లో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, 360-డిగ్రీల కెమెరా, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో సహా హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, గూగుల్, సిరి వాయిస్ అసిస్టెంట్‌లు ఉన్నాయి.