Prime9

Kommineni Arrest: కొమ్మినేని అరెస్ట్ పై స్పందించిన జగన్

ys jagan condemns kommineni arrest: జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ పై వైఎస్ఆర్సీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ స్పందించారు.  కొమ్మినేని అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు.  ప్రజల తరుపున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఎల్లప్పుడూ అధికారంలో ఉండరన్న వైఎస్ జగన్.. మరో నాలుగేళ్ల తర్వాత చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఓ టీవీ ఛానెల్లో చర్చ సందర్భంగా కొమ్మినేని చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ పోలీసులు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆపై విజయవాడకు తరలించారు. కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపైనా
79, 196(1), 353(2), 299, 356(2), 61(1)BNS, 67 ITA-2008, 3(1)(U), SC, ST POA act కింద కేసులు నమోదు చేశారు.

Exit mobile version
Skip to toolbar