Site icon Prime9

Organic Fertilizers: సేంద్రీయ ఎరువులతో లాభదాయకమైన సేద్యం

organic fertilizers

organic fertilizers

Organic Fertilizers: వ్యవసాయం ప్రపంచం మొత్తానికి ఆహారం అందించే పని. దీనిని చాలా మంది వృత్తిగా కాక నమ్ముకున్న శక్తిగా చూస్తారు. కానీ కొంత మంది దీనిని పక్కా కమర్షియల్ గా చూస్తూ ఈ వ్యవసాయాన్ని అధునాతన పద్ధతులంటూ ఉపయోగించి భూమాతకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నారు. దాని ద్వారా మానవాళి అంతా అనేక విపరీత పరిణామాలను ఎదుర్కొంటున్నాం. పంటలు అధిక దిగుబడి రావాలని నానా రకాల రసాయనిక ఎరువులను వాడుతుండడం చూస్తున్నాం. దాని ఫలితంగా ఆహారపదార్ధాలు నిస్సారంగా విషపూరతమైన పదార్థాలను కలిగి ఉంటున్నాయి. దానితో ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. అయితే, సహజ వనరులైన సేంద్రీయ ఎరువులను ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షిస్తూ, నాణ్యమైన, అధిక దిగుబడులను పొందవచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అదెలానో, మరి ఆ సేంద్రీయ ఎరువులేంటో ఓ లుక్కెయ్యండి.

సేంద్రీయ ఎరువులు రెండు రకాలు అవి..
స్థూల సేంద్రీయ ఎరువులు
చిక్కటి సేంద్రీయ ఎరువులు

స్థూల సేంద్రీయ ఎరువులు
వీటిని పశువుల ఎరువు, కంపోస్టును ఉపయోగించి తయారు చేస్తారు. వీటితో పాటు అన్ని రకాల సూక్ష్మ మూలకాలు ఈ సేంద్రీయ ఎరువులతో లభ్యమవుతాయి. ఇవి నేలను సారవంతంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

చిక్కటి సేంద్రీయ ఎరువులు
నూనె గింజల పంటల నుంచి నూనె తీయగా మిగిలిన పదార్థాన్ని ఎరువుగా వాడుకోవచ్చు. వీటినే చిక్కటి సేంద్రీయ ఎరువులు అని పిలుస్తాం. వీటిలో వేరుశనగ పిండి, ఆవచెక్క, వేపపిండి, ఆముదం పిండి ఉంటాయి. అయితే వేరుశనగ పిండి, నువ్వుల పిండి, ఆవపిండిని పశువుల మేతగా, కోళ్ళ మేతగా వాడుతూ, మిగిలిన వాటిని మాత్రమే ఎరువులుగా ఉపయోగిస్తున్నారు.

జీవామృతం
సేంద్రీయ ఎరువుల తయారీలో జీవామృతం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిని తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే తయారుచేసుకోవచ్చు. ఆవు పేడ, ఆవు మూత్రం, శనగపిండి, బెల్లం, పుట్టమన్ను కలిపి వారం రోజులపాటు నిల్వ ఉంచడం వల్ల జీవామృతం సిద్ధమవుతుంది. ఈ జీవామృతాన్ని మొక్కల్లో వేయడం వల్ల చీడపీడల నుంచి నివారణ లభిస్తుంది.

సేంద్రీయ ఎరువులను ఉపయోగించడం వల్ల నేల సారవంతంగా ఉండి అధిక దిగుబడి వస్తుంది. మొక్కలు బాగా అభివృద్ధి చెందుతాయి. నేలలోనే అన్ని మూలకాలు పుష్కలంగా లభిస్తూ ఆహార పదార్థాలు ఆరోగ్యవంతంగా పండుతాయి.

ఇదీ చదవండి: జన్యుపరంగా బలమైన గోధుమవిత్తనం (PBW 826) విడుదల

Exit mobile version