PM Kisan Mandhan Yojana 2022: ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం పేరిట వయసు పైబడిన రైతులకు సామాజిక మరియు ఆర్థిక భరోసా రైతులకు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన అనే పథకాన్ని రైతులకు అమలు చేస్తుంది.
ఈ పథకానికి కావలిసిన అర్హతలు ఇక్కడ చదివి తెలుసుకుందాం
ఈ పథకానికి గరిష్ఠంగా 5 ఎకరాల వరకు భూమి ఉండాలి
వయసు 18-40 సంవత్సరాల్లోపు వయసున్న రైతులను మాత్రమే ఈ పథకానికి అర్హులు.
60 సంవత్సరాల వయసు నిండిన వారు కిస్తీ కట్టాల్సిఉండగా రైతులకు 60 ఏళ్ళు నిండిన నాటి నుంచి ప్రతినెల రూ.3 వేల చొప్పున పింఛన్‌ను ఈ పథకం ద్వారా అందిస్తారు.ఈ పథకంలో చేరే వారి వయసును బట్టి రైతు చెల్లించాలిసిన ప్రీమియం ప్రభుత్వం రైతు బీమాను కంపెనీకి చెల్లిస్తుంది.ఉదాహరణకు ఒకటి చెప్పుకుందాం 18 సంవత్సరాల రైతు రూ.55 చెల్లిస్తే కేంద్రంకూడా రూ.55ను కలిపి బీమా కంపెనీకి మొత్తం రూ.110 చెల్లిస్తుంది. 18 ఏళ్ళు నిండిన వారికి ప్రీమియం రూ.55 ఉండగా ప్రతి ఏటా వయసును బట్టి రూ.3 నుంచి రూ.10 వరకు పెరుగుతుంది. 40 ఏళ్ళు నిండిన వారికి రూ.200 ప్రీమియం చెల్లించాలిసి ఉంటుంది.
ఇదీ చదవండి : Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం కోసం కావలిసిన అర్హతలు