Site icon Prime9

Oil Palm Cultivation: ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగుకు గోద్రెజ్ అగ్రోవెట్ ఒప్పందం

Oil Palm Cultivation: అగ్రి బిజినెస్ కంపెనీ గోద్రెజ్ అగ్రోవెట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ కింద అస్సాం మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలతో మూడు అవగాహన ఒప్పందాలు (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండ్) కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

ఎమ్ఒయులో భాగంగా, గోద్రెజ్ ఆగ్రోవెట్ కు పామాయిల్ తోటల సాగు మరియు అభివృద్ధి కోసం మూడు రాష్ట్రాలలో భూమిని కేటాయించబడుతుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌ సాగు చేసి రైతులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఆగష్టు 2021లో భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ రూ.11,040 కోట్లు వ్యయంతో ప్రారంభించింది.

ఈ మిషన్ కింద ఈశాన్య ప్రాంతం మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి సారించి 2025-26 నాటికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు మరియు 2029-30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం భావించింది.

Exit mobile version