Site icon Prime9

Black Gram Cultivation: మినుమ పంటను ఎలా సాగు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం

millet crop prime9news

millet crop prime9news

Black Gram: తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి, మినుమ పంటను ఎక్కువుగా సాగు చేయనున్నారు. వరి తర్వాత మనం ఎక్కువగా పండించే పంటల్లో మినుము కూడా ముందు వరుసలో ఉంది. మినుము పంట సాగుకు మాగాణి, మెట్ట భూములు అనుకూలంగా ఉంటాయి. వరి పొలాలు వేసుకోవడానికి నవంబర్ నెల అనుకూలంగా  ఉంటుంది. సెప్టెంబర్ నెల మినుము పంటకు అనుకూలంగా ఉంటుంది.  మినుము పంట పండించడానికి  ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు. కేవలం వర్షపు నీటితోనే మినుము పంటను బాగా  పండించవచ్చు. ఈ పంట సాగుకు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ, ఎక్కువ ఆదాయం పొందవచ్చు. మినుము పంట పండించడానికి  చౌడుభూములు పనికిరావు. తేమను నిలుపుకోగల భూములు, మురుగు నీరు నిలవకుండా ఉండే భూములు  మినుము పంటకు అనుకూలంగా ఉంటాయి. మినుము పంట వేసే ముందు వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలు పడగానే పల్ల గొర్రు ట్రాక్టర్ తో భుమిని మెత్తగా తయారు చేసుకోవాలి.

తొలకరిలో ఎకరానికి 5.8 కిలోలు, రబీ మెట్టలో ఎకరానికి  5.8 కిలోలు, రబీ మాగాణిలో ఎకరానికి 16 కిలోలు, వేసవి మాగాణిలో ఎకరానికి 16-18 కిలోలు విత్తనాలను విత్తుకోవాలి.

మినుములో తెగుళ్ల నివారణ :

పల్లాకు తెగులు:  జెమిని వైరస్‌ వల్ల ఈ తెగులు వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ మచ్చలు ఏర్పడి, ఆ చెట్టు అంతా పాడవుతుంది. ఈ  వైరస్  తెగులును మొదటిలోనే  గుర్తించగలిగితే దీన్ని అదుపు చేయవచ్చు. దీన్ని అలాగే ఉంచితే పైరు పూతపూయక మొత్తం ఎండిపోతుంది. ఈ వైరస్‌ తెల్లదోమ వల్ల పైరు మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు పొలంలో పల్లాకు తెగులు ఉన్న మొక్కలను గుర్తించి వాటిని మందులతో  పిచికారి చేయాలి. మోనోక్రోటోపాస్‌ పొలాల మందును 1.6 మి.లీ లీటరు నీటిలో కలిపి ఎకరాకు 200 లీటర్ల నీటిని పిచికారీ చేయాలిసి ఉంటుంది.

Exit mobile version