Site icon Prime9

Cotton : ప్రత్తి తెగుళ్ళను నివారించే పద్దతుల గురించి తెలుసుకుందాం !

cotton peime9news

cotton peime9news

Cotton: ప్రస్తుతం ప్రత్తి సాగులో కాయ తొలుచు పురుగులను తట్టుకునే బిటి హెబ్రిడ్లనే వాడుతున్నారు.ప్రైవేటు కంపెనీలకు చెందిన విత్తనాలు ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. రైతులు తమ భూమికు అనువైన విత్తనాలు పెట్టడం వల్ల వాటి దిగుబడులను మరియు సామర్థాన్ని బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.ప్రత్తి సాగు చేయు భూముల్లో ప్రతీ ఏడాది ఎకరాకు 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా ఇతర సేంద్రీయ ఎరువును దుక్కిలో వేసి చల్లుకోవాలి.

పచ్చదోమ
ఎక్కువ వర్షం పడినప్పుడు,మబ్బులతో కూడుకున్న చల్లని వాతావరణంలో ఈ పురుగు ఎక్కువగా వృధ్ది చెందుతుంది.మొదటి దశలో ఈ పురుగు విచ్చలవిడిగా ఆకు రసాన్ని పీల్చుతుంది. అలాంటి సమయంలో ఈ తెగులును అదుపు చేయడానికి పచ్చ దోమ తెగులుకు రసాయన మందులను పిచికారి చేయకుండా కాండానికి మందు పూసే పద్దతిని పాటిస్తే…30,45 రోజుల్లో మోనోక్రోటోఫాస్,నీరు 1:4 నిష్ప్తత్తిలో, 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్ప్తత్తిలో కాండానికి పూయాలి. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యస్పీ 1.45 గ్రా. లేదా ఫ్లేనికామిడ్ 0.3 గ్రా. లేదా లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళకు ఈ నివారణ చర్యలు చేపట్టండి:

1.తెగుళ్ళను లేదా కరవును తట్టుకునే విత్తనాలను ఎంచుకోవాలిసి ఉంటుంది.
2.బలమైన కాడలతో వచ్చే విత్తనాలను విత్తుకోవాలి.
3.విత్తనాలు మొలిచే సమయంలో పొడి వాతావరణం ఉండకుండా చూసుకోవాలి.
4.మొక్కల మధ్య ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాలి.
5.పూలు పూసే దశలో నీరు పెట్టి మట్టిలో మంచి తేమ ఉండేలా చూడాలి.

Exit mobile version