Breaking News

వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్

18 th Oct 2020, UTC
వైల్డ్  లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్

 "వైల్డ్  లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్" గా ఓ భారతీయ వనిత నిలిచింది.. భారత ఖ్యాతి ని ప్రపంచ దేశాలకు చాటింది.. భారత్ కు చెందిన ఐశ్వర్య శ్రీధర్.. 23 సంవత్సరాల అమ్మాయి.. "వైల్డ్  లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్" అవార్డు ను గెలుచుకున్నారు.. ఈ పోటీ కోసం.. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల ఎంట్రీలు వచ్చాయి.. వాటి నుంచి వివిధ విభాగాలలో 100 ఫొటోలను ఎంపిక చేసారు.. వాటిలో.. 'అకశేరుకాల ప్రవర్తన' కేటగిరీలో ఐశ్వర్య  కు "వైల్డ్  లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్"  అవార్డు లభించింది. ఈ నెల 13న లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించారు.
           ఐశ్వర్య తాను తీసిన ఫోటో కి 'లైట్స్ ఆఫ్ పాషన్' అని నామకరణం చేశారు. ఈ అవార్డు లభించడం పట్ల ఐశ్వర్య ట్విట్టర్ మాధ్యమం గా హర్షం వ్యక్తం చేసారు. ఈ అవార్డు రావడం యువ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా తనకు గర్వకారణమన్నారు. అడల్ట్ కాటగిరి లో ఈ అవార్డు పొందిన యువ ఫోటోగ్రాఫర్ ను తానేనని ఆమె పేర్కొన్నారు. ఈ అవార్డు దక్కడం తనకు గొప్ప గౌరవమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భం గా డబ్ల్యూపీవై బృందానికి  ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఐశ్వర్య వృత్తిరీత్యా  వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఫిల్మ్ మేకర్. కన్జర్వేషనిస్ట్.. చిత్తడి నేలల పరిరక్షణ చర్యలకు సంబంధించి ఆమె 2019 లో ప్రిన్సెస్ డయానా చేతులమీద అవార్డు ను అందుకున్నారు. బాంబే హైకోర్టు నియమిత స్టేట్ వెట్‌ల్యాండ్ ఐటెండిఫికేషన్ కమిటీలోఆమె యువ సభ్యురాలు గా ఉన్నారు.మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox