Breaking News

జల్లికట్టు అంటే ఎందుకంత క్రేజ్?

17 th Jan 2022, UTC
జల్లికట్టు అంటే ఎందుకంత క్రేజ్?

 jallikattu: తెలుగు ప్రజలకు అసలైన పండుగ అంటే సంక్రాంతే . కత్తి కట్టిన పందెంకోడి ఒకవైపు అయితే - రంకెలేసే కోడెగిత్త ఇంకోవైపు. దేని కథ దానిదే. గోదావరి జిల్లాలలో కోడిపందేలు , చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఏ రేంజ్ లో జరుగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . సంక్రాంతికి ముందు , ఆ తరువాత.. మొత్తంగా జనవరి నెలంతా ఈ పందేలు జరుగుతూనే ఉంటాయి. వాడైన కొమ్ములు, బలిష్టంగా ఉండే ఎద్దులతో - భీకరంగా పోరాడే యువకులను చూస్తే... ఒళ్ళు గగుర్పొడవడం ఖాయం ఎవరికైనా.     ఇంతకూ.... జల్లికట్టు ఎక్కడ మొదలైంది? చిత్తూరు జిల్లాలో ఈ ఆట ఓ సాంప్రదాయంలా ఎలా మారింది? ఏపీలోని చిత్తూరు వాసులకు , తమిళనాడు ప్రజలకు - జల్లికట్టు అంటే ఎందుకంత పిచ్చి?

 గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సంక్రాంతి పండుగ జనవరి నెలంతా జరుగుతూ ఉంటుంది. ఏపీలో సంక్రాంతికి కోడిపందాలు ఫేమస్ అయితే... తమిళనాడులో జల్లికట్టు ఇంకా ఫేమస్. తమిళనాడును ఆనుకుని ఉండే - మన చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు ఘనంగా జరుగుతుంది . అయితే ఈ జల్లి కట్టు వల్ల ఎంతో మంది గాయ పడిన వాళ్ళు... ప్రాణాలు సైతం కోల్పోయిన వారు కూడా ఉన్నారు. జల్లికట్టుని  నిషేధించాలని  కొన్నాళ్ళు నిరసనలు ధర్నాలు కూడా జరిగాయి.   జల్లికట్టు వల్ల మనుషులకే కాదు - మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. చుట్టూ వందల సంఖ్యలో అందరూ చేరి... పరిగెత్తుతున్న ఎద్దులను  లొంగదీసుకునేందుకు ప్రయత్నించడమే ఈ  జల్లి కట్టు. ఈ క్రీడలో ఎద్దులు  దొరికిన వారిని దొరికినట్టుగా కుమ్మేస్తూ  ఉంటాయి. ఇలా ఎద్దుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు  చాలా మంది ఉన్నారు.         ఎంత మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ - జల్లికట్టు ఆటను మాత్రం నిషేధించలేదు. ఈ జల్లికట్టులో పరిగెత్తుతున్న ఎద్దులు  అడ్డు వచ్చిన వాళ్ళందరిని పదునైన కొమ్ములతో మీద పడి  దాడి చేస్తూ ఉంటాయి. ఓ వైపు ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతున్నప్పటికి - జల్లికట్టును చూసేందుకు ప్రజలు బాగా ఆసక్తి చూపుతుంటారు.   జల్లికట్టు ఆచారం తమిళనాడులో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే తమిళనాడుతో పాటు తమిళనాడు బార్డర్ లో ఉన్న రాష్ట్రాలలో కూడా జల్లికట్టు సాంప్రదాయం కొనసాగుతోంది. 

 తమిళనాడులో జల్లికట్టు క్రీడకు విశేష స్థానం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా జనవరిలో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. తమిళనాడులో మధురైకి దగ్గరగా ఉన్న అలంగనల్లూరు గ్రామంలో జరిగే పోటీలను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తారు. ఇది తమిళుల వీరత్వాన్ని చాటే సాహసక్రీడగా భావిస్తారు అక్కడి వారు. అలాంటి జల్లికట్టు క్రీడను రాక్షసక్రీడగా జంతుప్రేమికులు భావించి గతంలో  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయిదేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఈ క్రీడపై నిషేధం విధించడంతో - తమిళనాడులో పెద్దయెత్తున ఉద్యమం చెలరేగింది. మెరీనా బీచ్ లో భారీ ర్యాలీని కూడా నిర్వహించారు. జల్లికట్టు క్రీడను నిషేధిస్తే ఊర్కొనేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సోషల్ మీడియాలో కూడా ఏకమై నిరసనలు తెలిపారు. అయితే ఈ సంప్రదాయ క్రీడ కోసం ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. అంతేకాదు బిల్లులో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన తమిళనాడు సర్కారు ఈ బిల్లుకు సవరణలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రంతోనూ ఆర్డినెన్సు జారీ చేయించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం యధావిధిగా.. జల్లికట్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

జల్లి కట్టు ఆటలో ఎద్దును లొంగదీసుకునేందుకు అనేక మంది యువకులు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఎవ్వరు అడ్డొచ్చినా సరే - ఎద్దు తన ఎదురుగా వచ్చిన వారిని పదునైన కొమ్ములతో పొడిచి గాయపరుస్తుంది.  కోనార్లు అని పిలువబడే బిషప్ లు నివసించే ప్రాంతాల్లో ఈ జల్లి కట్టు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడులోని మధురై, పలామెడు, పుదుక్కొట్టై, నార్తమలై, తేనిమలై వంటి నగరాల్లో జల్లి కట్టు క్రీడ బాగా ప్రాచుర్యం పొందగా, మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ జల్లి కట్టును ఆటను కొనసాగిస్తున్నారు.  తమిళనాడులో తరతరాలుగా జరుగుతున్న ఈ వేడుకలో ఎద్దు మెడకు ఒక ఉంగరాన్ని కడతారు. ఆ ఎద్దును రింగులోకి వదులుతారు. క్రీస్తు పూర్వం 400 ఏళ్ల క్రితం నుండి ఈ ఆటను కొనసాగిస్తున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం జల్లికట్టుగా పిలువబడే ఈ పేరు పూర్వం సల్లి కట్టుగా ఉండేది. సల్లికట్టు అంటే ఎద్దు మెడలో బంగారం బాగా అలంకరించడం. ఎద్దుతో ఎవరైతే వీరోచితంగా పోరాడి ఆ బంగారాన్ని తీసుకొస్తారో వారే విజేతగా నిలుస్తారు. 

పురుషులందరూ జల్లి కట్టు ఆట ద్వారా తమ ధైర్యాన్ని, బలాన్ని చాటి చెప్పేందుకు దీన్ని వేదికగా చేసుకునేవారు. ఈ పోటీలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు క్యూ కట్టేవారట. ప్రస్తుతం జల్లి కట్టులో విజేతగా నిలిచిన వారికి బంగారం, నగదు వంటి బహుమతులు ఇస్తున్నారు. జల్లి కట్టు వంటి ఆట విదేశాల్లోనూ ప్రముఖ క్రీడగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్   మెక్సికోలలో , బుల్ వార్ ఇప్పటికే జాతీయ వినోద క్రీడగా వర్థిల్లుతోంది.  జల్లి కట్టులో ముందుగా ఎద్దులను ముస్తాబు చేస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. కొన్నిచోట్ల బుడగలు కూడా కడతారు. అంతేకాదు వీటిని బరిలో దింపేందుకు కొన్ని రోజుల నుండే సిద్ధం చేస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమలో కోళ్లకు ఎలా అయితే బలమైన పౌష్టికాహారం ఇస్తారో.. అదే విధంగా అక్కడ కూడా ఎద్దులకు మంచి దానా  వేసి మేపుతూ ఉంటారు. తర్వాత జల్లికట్టుకు సిద్ధం చేస్తారు.

చిత్తూరు జిల్లాలో తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయన్ని రైతులు పవిత్రంగా భావిస్తుంటారు.  కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుడు మట్టి పుట్టలో వున్నప్పుడు గోమాత పాలిచ్చినందున ఈ ప్రాంతవాసులు గోవులను దైవంతో సమానంగా భావిస్తారు. వెంకటేశ్వర స్వామికి గోవులకు అవినాభావ సంబంధం వున్నందునే - తాము సంక్రాంతి సందర్బంగా ఆవులను పూజించి పండుగ చేసుకొంటామని చెప్తారు  .  ఒకప్పుడు సాంప్రదాయంగా మొదలైన ఈ పశువుల పండుగ.. నేడు ఓ క్రీడగా మారింది.  డప్పులు, బాణాసంచాలతో వాటిని అదిరించి పరుగులు పెట్టిస్తారు. పశువులు భయంతో పరుగులు తీస్తుంటే - వాటితో పోరాడేందుకు కొందరు బరిలోకి దిగుతారు .చిత్తూరు జిల్లాలోని జల్లికట్టును చూసేందుకు జిల్లా నలుమూలలు నుంచే కాకుండా - పొరుగు రాష్ట్రాల నుంచీ ఔత్సాహికులు  పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. పశువులను పట్టుకోవడంలో చూపించే దమ్ము, ధైర్యాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే మాంచి కిక్ ఉంటుందని స్థానికులు అంటారు. జల్లికట్టు ధైర్యసాహసాలతో కూడిన క్రీడ.  జల్లికట్టు క్రీడలో పాల్గొనడం అంటే ప్రాణాలతో చెలగాటమే. మనుషులే కాదు మూగజీవాలూ తీవ్రంగా గాయపడతాయి. వాటిని ఇంతగా హింసించడం తగదని ఇలాంటి క్రీడలకు స్వస్తి పలకాలని డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. కానీ  - జల్లికట్టుకు ఉన్న ఆదరణ ఏమాత్రం చెక్కు చెదరలేదు.జల్లికట్టునే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు. తమిళనాడులో మంజు విరాట్టు అంటే ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం.  నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో - సుమారు 3500 సంవత్సరాల క్రితంవిగా చెప్పబడుతున్న శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి.

మధురైకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. దీని వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చునని పురాతత్త్వ శాస్త్రవేత్తల అభిప్రాయం . వీటన్నింటినీ బట్టి చూస్తే - ఎద్దులతో ఆటకు వేల ఏళ్ళ చరిత్రే ఉందని స్పష్టమవుతోంది .జనవరి నెలంతా చిత్తూరు  జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో జల్లికట్టు పోటీని నిర్వహిస్తూ ఉంటారు.    ఎక్కడైతే జల్లికట్టు జరపాలి అనుకుంటారో ఆ వీధుల్ని మట్టితో చదును చేసుకుంటారు. పశువులు బయటకు పోకుండా ఆ వీధికి రెండు వైపులా అడ్డంగా కర్రల్ని, వెదురు తడికల్ని కట్టి ప్రత్యేకంగా అళ్లిని ఏర్పాటు చేస్తారు. ఆ అళ్లిలోకి విడివిడిగా , లేదంటే గుంపులు గుంపులుగా పశువుల్ని వదులుతారు. అయితే... తమిళనాడు తరహాలో - చిత్తూరు జల్లికట్టులో జూదం ఉండదని స్థానికులు చెబుతున్నారు .    జల్లికట్టు లో లక్షల్లో పందాలు కాస్తారు. ఇక్కడ అదేమీ ఉండదని అంటున్నారు.  దాదాపు రెండు మూడు మండలాల ప్రజలంతా ఇక్కడికి వచ్చి పశువులను పట్టుకోవడానికి పోటీలు పడతారు.  సంక్రాంతి పండుగ‌కు ముందు నుంచే ఈ ప‌శువుల పోటీలు చిత్తూరు జిల్లా న‌లుమూల‌లా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం జ‌రుగుతూ ఉంటాయి.

సరదా కోసం ఆడే ఏ ఆట అయినా... సరదాగానే ఉండాలి. కొందరు ఔత్సాహికుల సరదా కోసం - ఎన్నో తాళిబొట్లు తెగుతున్నాయి. ఎందరో తల్లులకు గర్భశోకం మిగులుతోంది . సంప్రదాయాలను ఎవరూ కాదనరు. కానీ, సంప్రదాయం పేరిట - మనుషుల ప్రాణాలు పణంగా పెట్టడం సరైనది కాదు . జల్లికట్టు అయినా... బుల్ ఫైట్ అయినా... రక్తం చిందించే ఆటలే. ఇది కంటికి కనిపించే నిజం .  సాధ్యమైనంతవరకూ... మనుషుల ప్రాణాలకు హాని కలిగించే ఆటలు ఆడకపోవడమే ఉత్తమం అని పరిశీలకులు సూచిస్తున్నారు 

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ బిచ్చగాడు జమాత్-ఎ-ఇస్లామీ (జెఐ) చీఫ్ సిరాజుల్-హక్

పూర్తయిన సంక్రాంతి సందడి.. తిరుగుప్రయాణంలో ప్రజలు.. కిక్కిరిసిన జాతీయరహదారులు

.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox