Breaking News

విశాల్ రహస్యాలు అన్నీ నాకు తెలుసు:అకౌంటెంట్ రమ్య

07 th Jul 2020, UTC

కోలీవుడ్ నటుడు, నిర్మాత విశాల్ కు చెన్నై లోని వడపళని, కుమరన్ కాలనీలో  చిత్ర నిర్మాణ కార్యాలయం ఉంది. ఇందులో అకౌంటెంట్ గా  పనిచేస్తున్న రమ్య అనే మహిళ రూ.45 లక్షలు ఆఫీసు సొమ్మును తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిందని విశాల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ  సొమ్మును ఆదాయపు పన్నుకు జమ చేయవలసింది వుందని తెలిపారు. అయితే తాజాగా రమ్య విశాల్ పై ఆరోపణలు చేసింది.

రమ్య ఒక ఛానల్లో  మాట్లాడుతూ  విశాల్ గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండామోసానికి ´పాల్పడుతున్నారని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.విశాల్ మేనేజర్  హరి మనుషులు  తన ఇంటికి వచ్చిబెదిరించారని ఆరోపింంది. విశాల్ కు  సంబంధించినచాలా విషయాలు తనకు తెలుసని,తనకుపోలీసులు రక్షణ  కల్పిస్తే మరిన్ని రహస్యాలను బయటపెడతానని తెలిపింది.
రమ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం కలిగించాయి. ఎందుకుంటే విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా పనిచేసారు. ప్రతీ విషయం పైనా తన దైన శైలిలో స్పందిస్తారు.  ఈ క్రమంలో ఆయనకు పలువురు వ్యతిరేకులుగా మారారు. అందువలన ఈ ఆదాయపు పన్ను వ్యవహారం విశాల్ కు చిక్కులు తెచ్చి పెడుతుందా లేదా అన్నది చూడాలి.

.. విశాల్‌ ప్రస్తుతం హీరోగా నటిస్తూ చక్ర, తుప్పరివాలన్‌ 2 చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఇటీవలే విడుదలైన చక్ర ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఎంఎస్ ఆ‌నందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటి రెజీనా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox