Breaking News

వకీల్ సాబ్ సినిమా జనాల గుండెల్లోకి వెళ్తుంది.. పవన్ కళ్యాణ్

05 th Apr 2021, UTC

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈసందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మహోన్నతమైన స్థానం సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజుతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు కలలు కనే వ్యక్తులంటే ఎంతో ఇష్టం ఎప్పటికైనా ఏదో సాధిస్తాను. ఓ స్థాయికి వెళ్తాను అనే వ్యక్తి ఆయన. ఆయన నా సినిమా తొలిప్రేమ ని కొనడానికి ముందుకొచ్చారు. విజయం ఎక్కడ ఉంటే దాన్ని అందుకొనే వ్యక్తి దిల్ రాజు. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ, ఇన్నేళ్లకు ఆ కోరిక తీరింది.

వేణు శ్రీరామ్ తాను ఓ టైలర్ కొడుకునని చెప్పారు. నా తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ స్థాయి నుంచే పైకొచ్చాము మేము. కాబట్టి మాకు ఏ వృత్తి ఎక్కువ కాదు ఏ వృత్తి తక్కువ కాదు. వేణు శ్రీరామ్ కూడా చాలా చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా చేయడం అంటే అవకాశం నేనో లేక ఇంకెవరో ఇచ్చేది కాదు. స్వశక్తితో తను సంపాదించుకుంది. ఇలాంటి దర్శకుడి దగ్గర నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఎప్పటినుంచో లాయర్ అనే వృత్తిపై ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ఓ పాత్రలో నటించే అవకాశం నాకు ఈ వకీల్ సాబ్ అనే చిత్రం ద్వారా లభించింది.

మీకు నా మీద ఎలాంటి అభిమానం ఉందో నాకు అంత అభిమానం నాకు అమితాబ్ బచ్చన్ పై ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి చేసిన పాత్ర నేను చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ వకీల్ సాబ్ సినిమా నేను పూజింజే ఆదిశక్తికి, ఇక్కడకు వచ్చిన, వేదికపై ఉన్న, టీవీల్లో వీక్షిస్తున్న అందరికీ. మేము ఇచ్చే గౌరవం. ఈ సినిమాలో ఓ నిస్సహాయ స్థితిలో చిక్కుకున్న ఓ ముగ్గురు అమ్మాయిలను ఆదుకొనే ఓ లాయర్ గా చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముగ్గురు అమ్మాయిలుగా అంజలి, అనన్య, నివేదా థామస్ లు అద్భుతంగా నటించారు.నా పర్పార్మెన్స్ ఈ సినిమాలో బాగుందంటే అందుకు కారణం ప్రకాశ్ రాజ్. థమన్ కూడా ఈ సినిమాకి చాలా చక్కని సంగీతం అందించాడు. ఇంతమంది ఇష్టపడి తమ ప్రేమంతా ధారపోసిన ఈ సినిమా జనాల గుండెల్లోకి వెళ్తుందనే నమ్మకం నాకు ఉంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలు వేణు శ్రీరామ్, దిల్ రాజు, అంజలి, అనన్య, హరీష్ శంకర్, బండ్ల గణేష్, చిత్ర బృందం పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox