Breaking News

తలవంచిన తనిష్క్ హిందూ కోడలు యాడ్ తొలగింపు

13 th Oct 2020, UTC

న్యూఢిల్లీ :తాము ఒకటనుకుంటే మెజారిటీ జనాలు మరోలా తలచారని ప్రముఖ జ్యూయలరీ సంస్ద తనిష్క్ బుర్ర పట్టుకుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దిగిరాక తప్పలేదు.#బాయ్ కాట్ తనిష్క్ అంటూ వెల్లువెత్తిన నిరసనలు, కామెంట్ల దెబ్బకు తన కొత్త యాడ్ ను సోషల్ మీడియా నుంచి తొలగించింది. 

తనిష్క్ ఓ వ్యాపార ప్రకటనకు సంబంధించి వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ముస్లిం కుటుంబంలో హిందూ కోడలిని చూపించారు. వారి మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను చూపించారు. ‘ఆమె తన సొంత బిడ్డలాగ ప్రేమించే కుటుంబంలోకి వచ్చింది. వారు సాధారణంగా జరుపుకోని సందర్భాన్ని ఆమె కోసం ఓ వేడుకలా జరుపుకుంటున్నారు. సంప్రదాయాలు, సంస్కృతులు వేర్వేరు అయినా రెండు మతాల అందమైన సంగమం ఇది’ అని తనిష్క్ ఆ వీడియోలో చెప్పింది. ఇందులో రెండు వర్గాల మధ్య సఖ్యతను వివరించినట్టు తనిష్క్ భావించింది కానీ, కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దేశంలో ‘లవ్ జిహాదీ’కి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ వీడియో ఉందని నెటిజెన్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిసారి ముస్లిం కుటుంబంలో హిందూ కోడళ్లనే చూపిస్తున్నారని, హిందూ కుటుంబంలో ముస్లిం కోడళ్లను చూపించడం లేదని కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. అలాంటి యాడ్ చేయండి అని సూచనలు ఇస్తున్నారు. ‘ఆ యాడ్‌లో హిందూ సంప్రదాయాలను ముస్లింలు గౌరవించాలనే కదా చెప్పారు’ అని మరికొందరు ఆ యాడ్‌కు మద్దతు పలుకుతున్నారు. 

తనిష్క్ నుంచి అభరణాలు ఎక్కువగా కొనేది హిందువులే. కాని వారినే చిన్నబుచ్చింది అన ఒక నెటిజన్ పోస్ట్ చేసాడు. మూడు నెలల పాటు తనిష్క్ షో రూమ్ లను బాయ్ కాట్ చేయండి అంటూ మరో నెటిజన్.. మా కుమర్తెను లవ్ జిహాద్ నుంచి రక్షించమని మరో నెటిజన్. ఇలా తనిష్క్ పై  నెటిజన్లు చెలరేగి పోయారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇందులో లవ్ జిహాద్ అంశం ఏమీ లేదన్నారు. ట్రోలింగ్ సరికాదన్నారు.అయితే అటువంటి వారి సంఖ్య  తక్కువ కావడం గమనార్హం. చివరకు తనిష్క్ యాడ్ ను తొలగించాల్సి వచ్చింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox