Breaking News

నేడు డాక్టర్స్ డే.. ఎందుకు జరుపుకుంటామో తెలుసా..?

01 st Jul 2020, UTC

నేడు  డాక్టర్స్ డే.. సృష్టిలో అన్ని రకాల పనులకు టైమింగ్స్ ఉన్నాయి.. వైద్యానికి తప్ప.. ఎపుడు అనారోగ్యం వస్తే.. వైద్యుడు అపుడే వచ్చి ప్రాణం పోస్తాడు.. రోగి మానసిక పరిస్థితి కి అనుగుణం గా వ్యవహరించి..అతని లోని భయాన్ని రోగాన్ని పోగొడతాడు.. అందుకే పెద్దలు అంటారు.. వైద్యో నారాయణో హరిః..అంటూ వైద్యుడిని నారాయణుడితో పోల్చారు. ప్రాణాలు నిలిపే డాక్టర్స్ కు సమయం తో సంబంధం లేకుండా పని చేయాల్సి ఉంటుంది. వ్యక్తి జీవితాన్ని కొన్ని సార్లు పక్కన పెట్టాల్సి వస్తుంది. 
 
                 పేషెంట్ కి బాధ కలుగకుండా చేసే చికిత్సపై వైద్యులు దృష్టి పెడతారు.. అలాంటి డాక్టర్లకు కృతజ్ఞతగా ప్రతి ఏడాది ఓ రోజును డాక్టర్స్ డే ను జరుపుతారు. ప్రతి సంవత్సరం జులై ఒకటవ తారీకున డాక్టర్స్ డే  జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ స్మృతి సందర్భంగా డాక్టర్స్ డే ని జరుపుకుంటున్నాం.. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జులై 1, 1882 లో జన్మించారు. జులై 1, 1962లో మరణించారు. 1961 లో ఆయనను భారత ప్రభుత్వం అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది.
 
                 డాక్టర్ బిధాన్ చంద్రరాయ్  పేరు పొందిన ఫిజీషియన్.. అంతే కాదు... ఆయన స్వతంత్ర యోధుడు కూడా.. ఆయన మొదట కలకత్తా మెడికల్ కాలేజీ లో చదివారు. ఆ తరువాత..   సెయింట్ బార్థాలమ్యూ హాస్పిటల్ లో మెడిసిన్ లో పీజీ చేశారు. ఆ తరువాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో సభ్యత్వం సాధించారు.  ఆ తదుపరి ఇండియా కు తిరిగొచ్చి.. కలకత్తా కాలేజీ లోనే పని చేశారు. జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, చిత్త రంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, చిత్తరంజన్ కాన్సర్ హాస్పిటల్ వంటివి అనేక సంస్థలను స్థాపించారు.. ఆ తరువాత.. పశ్చిమ బెంగాల్ కు రెండవ ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యారు.  1948 నుండి 1962 లో మరణించేవరకూ ఆయన తన సేవలను అందిస్తూ వచ్చారు. అంతే కాదు.. ఆయన బ్రహ్మ సమాజం లోను సభ్యత్వాన్ని తీసుకున్నారు. దుర్గాపూర్, బిధాన్ నగర్,అశోక్ నగర్, కల్యాణి, హబ్రా అనే పశ్చిమ బెంగాల్ కు చెందిన నగరాలను ఆయన అభివృద్ధి చేశారు. ఆయన గౌరవార్ధం.. భారత్ ఆయన పేరు పై ఓ అవార్డు ను కూడా స్థాపించింది.
 
               డాక్టర్లు దేశానికీ చేస్తున్న సేవను గుర్తించడానికి వారి కోసం ప్రత్యేకం గా ఓ రోజును కేటాయించారు.ఈ రోజున రకరకాల ఈవెంట్స్, యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తారు. ఫ్రీ మెడికల్ కాంప్స్ నిర్వహించి ఆరోగ్యం మీద అవగాహనను కలుగచేస్తారు. దేశ వ్యాప్తం గా హెల్త్ చెకప్, ప్రివెన్షన్, రోగనిర్ధారణ, చికిత్స వంటి విషయాల మీద చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox