Breaking News

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు రోహిత్ శర్మ గిఫ్ట్..!

15 th Jan 2021, UTC

బిగ్ బాస్ విజేత అభిజిత్ కు రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్ ను పంపారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినందుకు రోహిత్ శర్మ స్వయం గా అభిజిత్ కు కాల్ చేసి అభినందనలు తెలిపారు. రోహిత్ శర్మ జెర్సీ పై 'విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్'  అని రాసి తన సంతకం కూడా పెట్టి అభిజిత్ కు పంపించారు. ఈ గిఫ్ట్ గురించి అభిజిత్ తన ట్విట్టర్ మాధ్యమం లో పంచుకున్నారు.

ఈ నేపధ్యం లో అభిజిత్, హనుమ విహారి కి కూడా థాంక్స్ చెప్పారు. ఎంతో ఒత్తిడి మీద ఉన్నప్పుడు కూడా చురుకైన ఆటతీరుతో ఆకట్టుకున్నట్లు అభినందించారు. అభిజిత్ కు రోహిత్ శర్మ అంటే అభిమానమని గతం లో చెప్పిన సంగతి తెలిసిందే. అతని క్రికెట్ ఆడుతుంటే అన్ని పనులను ఆపుకుని మరి క్రికెట్ చూస్తూ ఉంటానని అభిజిత్ ఓ సందర్భం లో తెలిపాడు. వాస్తవానికి రోహిత్ శర్మ మహారాష్ట్ర నుంచి వచ్చాడు. అయినప్పటికీ, అతనిలో తెలుగు మూలాలు ఉండడం తో స్పష్టమైన తెలుగు ని మాట్లాడగలుగుతారు.

రోహిత్ శర్మ కాకుండా, మరో తెలుగు తేజం హనుమ విహారి కూడా టీం ఇండియా తరపున ఆడుతున్నాడు. ఓ రోజు వీరిద్దరి మధ్య తెలుగు బిగ్ బాస్ గురించి చర్చకు వచ్చింది. ఈ క్రమం లో రోహిత్ శర్మ అభిజిత్ కు ఈ గిఫ్ట్ పంపారు. తాను ఎంతో అభిమానించే క్రికెటర్ నుంచి బహుమతి రావడం తో అభిజిత్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox