Breaking News

పబ్జీ కి అంత్యక్రియలు చేసిన యువకులు

08 th Sep 2020, UTC
పబ్జీ కి అంత్యక్రియలు చేసిన యువకులు

ట్రెండింగ్ :  కేంద్రం ఇటీవలపబ్జీ తో సహా 118 యాప్ లను నిషేదించిన విషయం తెలిసిందే.  అయితే టిక్ టాక్ తరువాత దేశంలో ఎక్కువమంది  ముఖ్యంగా చిన్నారులు, యువత పబ్జీ కి  బాగా అలవాటు పడిపోయారు. గంటల తరబడి పబ్జీ ఆటలో మునిగి తేలినవారు ఇపుడు దీన్ని నిషేదించడంతో పిచ్చెక్కిపోతున్నారు. అహమ్మదాబాద్ లో కొంతమంది యువకులు పబ్జీ నిషేధాన్ని తట్టుకోలేకపోయారు. దీనితో పబ్జీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అంత్యక్రియలు నిర్వహించారు.

అహ్మదాబాద్ కు చెందిన 20 మంది యువకులు తెల్లిని దుస్తులు ధరించి పబ్జీ ప్లే కార్డును పట్టుకున ఊరేగింపుగా  బయలు దేరారు. అనంతరం దానికి  హిందూ సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా రోషన్ పటేల్ అనే యువకుడు మాట్లాడుతూ తాము గంటల తరబడి పబ్జీ ని ఆడేవారమని ఇపుడు ఒక్కసారిగా దాన్ని నిషేదించడంతో షాక్ కు గురయ్యామని తెలిపాడు. పబ్జీ ఇకలేదు అన్నమాటే తమకు నమ్మశక్యంగా లేదని ఈ విషయాన్ని తాము తట్టుకోలేకపోతున్నామని తెలిపాడు.  డిజిటల్ స్ట్రైక్ లో భాగంగా భారత్ చైనాకు చెందిన 224 యాప్ లను నిషేధించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox