Breaking News

టిక్ టాక్ నిషేధం పెద్దనోట్ల రద్దు లాంటిదే:నుస్రత్‌ జహాన్‌

01 st Jul 2020, UTC

టిక్ టాక్  నిషేధం వెనక ఉన్న వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని  తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ ప్రశ్నించారు.  టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం  విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అన్నారు.

మూకుమ్మడిగా చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌ను నిషేధించడం వల్ల దేశంలోని యువత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపోయారని విమర్శించారు.ఇప్పడు టిక్‌టాక్‌ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారని నుస్రత్‌ జహాన్‌ అన్నారు.

భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్‌ యాప్‌లపై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గూగుల్‌ ప్లే స్టోర్, యాప్‌ స్టోర్‌ల‌లో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్నియాప్‌లను కూడా తొలగించారు. భారత్‌- చైనా సరిహద్దు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి కొంత మంది మద్దతు పలకగా. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

 టిక్‌టాక్‌ సీఈఓ భారతదేశంలోని తమ ఉద్యోగులకు లేఖ రాస్తూ.. టిక్‌టాక్‌ సంస్థ ఉద్యోగులు గర్వించదగిన సానుకూల అనుభవాలు, అవకాశాలను పునరుద్ధరించడానికి తమ శక్తి మేరకు పని చేస్తామని తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox