Breaking News

నా పెళ్లిని  మా నాన్న వ్యతిరేకించారు కాజోల్ 

14 th Jan 2021, UTC

కాజోల్ తన త్రిభంగ చిత్రంతో డిజిటల్ అరంగేట్రం  చేస్తోంది. ఈ  చిత్రంలో తన పాత్ర గురించి  చెబుతూ అది తన నిజ జీవిత వ్యక్తిత్వానికి పొడిగింపు అని  తెలిపింది.  మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో  తన పాత్రకు మరియు తనకు మధ్య సారూప్యతలను , నటిగా తన జీవిత నిర్ణయాలు ఎలా తీసుకున్నదీ  వివరించింది.

కాజోల్  తన జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ అయిన వివాహం గురించి  తెలిపింది. నటుడు అజయ్ దేవ్‌గన్‌తో 24 ఏళ్ళ వయసులో  పెళ్లికి తన తండ్రి మద్దతు లేదని చెప్పింది. నా తండ్రి (షోము ముఖర్జీ)  నేను 24 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవడానికి వ్యతిరేకంగా ఉన్నారు.  అయితే  మా అమ్మ (తనూజా) నాకు అతిపెద్ద మద్దతుదారు.  దైర్యంగా వెళ్ళమని చెప్పారు. చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ నా కోసం నిలబడటం నా అదృష్టం. కాబట్టి, నేను చేయాలనుకున్నది సరిగ్గా చేసాను. నేను పితృస్వామ్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.  నేను దాన్ని  అనుకోకుండా ఎదుర్కొన్నానంటూ తెలిపింది.

తన తల్లి తనను స్వతంత్రంగా చేసిందని, తన కుమార్తె నైసా కూడా ఆమెలాగే స్వతంత్రంగా ఉందని ఆమె అన్నారు.  త్రివి అజ్మీ మరియు మిథిలా పాల్కర్‌లతో కలిసి  కాజోల్ త్రిభంగలో కనిపిస్తుంది . ఈ చిత్ర టీజర్‌కు గొప్ప స్పందన వచ్చింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox