Breaking News

ప్రపంచ టాప్‌-10 కుబేరుల జాబితాలోముకేశ్ అంబానీ..!

22 nd Jun 2020, UTC
 ప్రపంచ టాప్‌-10 కుబేరుల జాబితాలోముకేశ్ అంబానీ..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ . ప్రపంచ టాప్‌-10 కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు. తాజాగా ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం లభించింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ఆయనకు 9వ స్థానం దక్కింది. ముకేశ్‌ అంబానీ నికర సంపద 64.5 బిలియన్ డాలర్లుగా సదరు సంస్థ పేర్కొన్నది.

ప్రపంచ సంపన్నుల జాబితాలోకెక్కే క్రమంలో ముకేశ్‌ అంబానీ.. ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్‌లను అధిగమించారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్ బుక్) ఉన్నారు.

కరోనాతో ఆర్థికవ్యవస్థ  మందగించినప్పటికీ ముకేశ్‌ అంబానీ రిలయన్స్ టెలికాం  విభాగంజియో ప్లాట్ ఫామ్‌లోకి పెట్టుబడు ఆహ్వానించడం ద్వారా ఆర్దికంగా పుంజుకున్నారు. ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ 115,693.95 కోట్ల రూపాయలు సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ కావడంతో . దీని ద్వారా 53,124.20 కోట్ల రూపాయలను సాధించింది.  

రిలయన్స్‌లో 42 శాతం వాటాలు ఉన్న ముఖేశ్ అంబానీ ఇటీవల పెట్టుబడుల ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చేశారు.     కేవలం 58 రోజుల్లో 168,818 కోట్ల రూపాయలు రిలయన్స్   సంపాదించడం  గమనార్హం.
 
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox