Breaking News

ఒకే ఐఎంఈఐ నంబరుతో 13,500 ఫోన్లు!

06 th Jun 2020, UTC
ఒకే ఐఎంఈఐ నంబరుతో 13,500 ఫోన్లు!

సాధారణంగా ఒక మొబైల్‌కు ఒక ఐఎంఈఐ నంబరు ఉంటుంది. రెండు సిమ్‌లు కలిగిన ఫోన్లలో రెండు ఐఎంఈఐ నంబర్లు ఉంటాయి. మొబైల్‌ను దుర్వినియోగం చేసినప్పుడు గుర్తించేందుకు ఈ నంబర్లు ఎంతో కీలకం. కానీ దేశంలో ఒకే ఐఎంఈఐ నంబరుతో ఏకంగా 13,500 ఫోన్లు ఉన్న షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

తన కొత్త ఫోనులో అంతా సక్రమంగా ఉన్నప్పటికీ పనిచేయడం లేదని, మరమ్మతు చేసినా పనిచేయడం లేదని, దీని సంగతేంటో చూడాలంటూ ఓ పోలీసు సైబర్ సెల్ పరిశీలన కోసం తన మొబైల్‌ను ఇచ్చాడు. దానిని పరిశీలించిన సైబర్ క్రైం నిపుణులు విస్తుపోయారు. అదే ఐఎంఈఐ నంబరుతో వేలాది ఫోన్లు పనిచేస్తున్నట్టు గుర్తించి షాకైనట్టు మీరట్ ఎస్పీ (సిటీ) అఖిలేశ్ ఎన్ సింగ్ తెలిపారు.



పోలీసుల మొబైల్‌కు ఉన్న ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)తో ఏకంగా 13,500 మొబైళ్లు పనిచేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నేరగాళ్లు దీనిని అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మొబైల్ తయారీదారు, దాని సర్వీస్ సెంటర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox