Breaking News

64 ఏళ్ల వయసులో ఎంబీబీస్ విద్యార్దిగా..

27 th Dec 2020, UTC
64 ఏళ్ల వయసులో ఎంబీబీస్ విద్యార్దిగా..

భారత్ వైద్య విద్య చరిత్రలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైరయి ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఒక వ్యక్తి ఎంబీబీఎస్ కోర్సులో చేరి చరిత్ర సృష్టించారు.ఒడిశాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్, జే కిషోర్ ప్రధాన్ నీట్  లో మంచి స్కోర్ సాధించి ప్రభుత్వ-వీర్ సురేంద్ర సాయి యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలో మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ విద్యార్థిగా చేరాడు. కోర్సు ముగిసిన తరువాత  తన జీవితకాలమంతా ‘ప్రజలకు సేవ చేయాలనే’ కోరికను ప్రధాన్  వ్యక్తం చేశారు.

 ప్రధాన్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 2016లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్‌ అయ్యారు.. డాక్టర్ కావాలన్నది ఆయనకు చిన్ననాటి నుంచి ఉన్నకల. 1970లో ఇంటర్మీడియట్‌ అయిన తరువాత ఒకసారి ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌ రాశారు. సీటు రాకపోవడంతో బీఎస్‌సీలో చేరారు. అయితే అప్పటి నుంచి తన కోరిక అసంపూర్ణంగానే ఉండిపోయింది. 15 ఏళ్ళు బ్యాంకు ఉద్యోగం చేశాక వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకొని, ఇదే ప్రయత్నం చేయాలను కున్నప్పటికీ కుటుంబం గడవడం కష్టమని భావించారు.  తన కుమార్తె లిద్దరు నీట్‌కి ప్రిపేర్‌ అవుతుండడంతో వారిని చదివిస్తూ తాను కూడా ప్రిపరేషన్  కొనసాగించారు.

 నీట్ పరీక్షకు హాజరు కావడానికి ఉన్నత వయస్సు పరిమితి 25  సంవత్సరాలు అవడంతో  ప్రధాన్  2018 లో సుప్రీంకోర్టులో  అర్హత కోసం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2019లో సుప్రీంకోర్టు నీట్‌ పరీక్షకు వయోపరిమితిని తాత్కాలికంగా ఎత్తివేసింది. దీనితో  నీట్‌లో 175 మార్కులు పొంది పీహెచ్ కోటాలో బర్లాలో ప్రభుత్వ, వీర్‌ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్‌ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox