Breaking News

లాక్ డౌన్ కొనసాగితే అవాంఛనీయగర్బాలు...!

04 th Jul 2020, UTC
లాక్ డౌన్ కొనసాగితే అవాంఛనీయగర్బాలు...!

కోవిడ్-19 కారణంగా కొన్ని కోట్ల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాలు, మందులు లభించకపోవచ్చని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ) హెచ్చరించింది. ఒకవేళ లాక్ డౌన్  కొనసాగితే.. ఇలాంటి అవాంఛిత గర్బాల సంఖ్య ఏకంగా 4.7 కోట్లకు చేరుకునే వీలుందని చెబుతున్నారు.ప్రపంచంలో అత్యల్ప ఆదాయం ఉన్న 114 దేశాలలో 4 కోట్ల 70 లక్షల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాలు అందుబాటులో ఉండకపోవచ్చని యూఎన్ఎఫ్‌పీఏ పేర్కొంది.ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ తాజాగా చేసిన పరిశోధనలో లాక్ డౌన్ వేళ మహిళలు కుటుంబ నియంత్రణ పద్దతులకు దూరం కావటంతో భారీ ఎత్తున గర్భధారణ జరగనుందని తేల్చింది.  అంతేకాదు.. లాక్ డౌన్ కారణంగా మహిళలు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లుగా ఈ రిపోర్టు తేల్చింది.బాలికలపై వేధింపులతో పాటు.. గృహహింస.. హక్కులకు భంగం వాటిల్లే పలు అంశాలు చోటు చేసుకుంటున్నట్లు మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

లాక్ డౌన్ కారణంగా పలు దేశాల్లోని భార్యాభర్తలు ఇద్దరు ఇళ్లల్లోనే వుండవలసి రావడంతో వారి మధ్య  సాన్నిహిత్యం పెరుగుతోంది. మరో వైపు .. గర్భధారణ నిరోధించే పిల్స్.. కండోమ్ లకు కొరత ఏర్పడ్డాయి. దీంతో.. గర్భనిరోధకాలు లేకుండానే రొమాన్సు చేస్తున్న కారణంగా మహిళలు అవాంఛనీయ గర్భధారణకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గర్భ విచ్చిన్నం చేయించుకోవడం నేరంగా పరిగణించే  దేశాల్లో ఇది మరింత సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. ఈ దేశాల్లో గర్భ నిరోధక సాధనాల కోసం ప్రజలు సామాజిక ఆరోగ్య కేంద్రాల మీద ఆధార పడతారు. నర్సులు, ఆయాలు, అత్యవసర విభాగాలు అందుబాటులో లేని పరి టాయనే భయంతో చాల మంది వీటికి దూరంగా ఉంటున్నారు మరో వైపు కొంతమంది మత నాయకులు వీటి వాడకం సరికాదని చెప్పడం తో  మహిళలపై ముఖ్యంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల మహిళలపై ప్రభావం వుందని తెలుస్తోంది.

లాక్ డౌన్ కొనసాగితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల కారణంగా.. కుటుంబ నియంత్రణ సౌకర్యం పొందలేకపోతున్నవారు అవాంఛిత గర్భాలకు గురవుతారు. గృహహింస, ఇతర హింసలకు గురయ్యే మహిళల సంఖ్య మిలియన్ల కొద్ది పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై కొవిడ్-19 విపత్తు ప్రభావం అధికంగా ఉండనుంది. స్త్రీ, పురుష అసమానతలు పెరిగిపోతాయి. మిలియన్ల మంది మహిళలు, బాలికలు తమ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం, ఆరోగ్యాన్ని కాపాడుకునే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని యూఎన్ ఎఫ్ పీఏ అభిప్రాయపడింది.అంతేకాదు..మహి
ళల్లో సున్తీ (ఎఫ్ జీఎం), బాల్య వివాహాలు వంటి వాటిని రూపుమాపేందుకు చేపట్టే కార్యక్రమాల జాప్యానికి ఈ మహమ్మారి కారణమవుతుంది. దాని ఫలితంగా వచ్చే దశాబ్ద కాలంలో 2 మిలియన్లకుపైగా ఎఫ్ జీఎం కేసులు నమోదవుతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox