Breaking News

న్యూస్‌ పేపర్‌తో రైలు తయారు చేసిన కేరళ బాలుడు..!

26 th Jun 2020, UTC

కేరళకు చెందిన 12 ఏళ్ల  అద్వైత్‌ కృష్ణఅనే విద్యార్ది న్యూస్‌ పేపర్‌తో అచ్చం రైలు నమూనాను తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ బాలుడు తయారు చేసిన రైలు నమూనా అతని సృజనాత్మకతను చాటిందని అందరు ప్రశంసిస్తున్నారు. అద్వైత్‌ కృష్ణ త్రిస్పూర్‌లోని‌ సీఎన్‌ఎన్‌ బాయ్స్‌ హై స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు.  అద్వైత్‌ న్యూస్‌ పేపర్‌తో‌ రైలును తయారు చేస్తు‍న్న వీడియోలను, ఫొటోలను గురువారం రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది

12 ఏళ్ల మాస్టర్‌ అద్వైత్‌ ఈ రైలును రూపొందించడానికి కేవలం 3 రోజుల సమయం తీసుకున్నాడు. ఇది తయారు చేయడానికి 33 న్యూస్‌ పేపర్లు, 10 ఎ4(A4) షిట్‌లు, గ్లూను ఉపయోగించి అచ్చమైన రైలు ప్రతిరూపాన్ని తయారు చేశాడు’ అని రైల్యే శాఖ తన ట్వీట్‌లో పేర్కొంది

. మాస్టర్‌ అద్వైత్‌ రైలు ఇంజన్‌, బోగీలను, ఇతర భాగాలను తయారు చేసి వాటిని అమర్చిన విధానాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూపించారు. కాగా ఈ వీడియో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే 32 వేలకు పైగా వ్యూస్‌, వందల్లో లైక్‌లు వచ్చాయి. ‘

అద్భుతం’, ‘ఈ బాలుడి తెలివి అందరికి స్ఫూర్తి’, ‘ఇతడికి రైల్వే ఆర్‌ అండ్‌ డీలో ఉద్యోగం ఇవ్వండి తన తెలివితో కొత్త టెక్నాలజీని తీసుకువస్తాడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox