Breaking News

ఇండియన్ రైల్వే అరుదైన రికార్డు..!

02 nd Jul 2020, UTC
ఇండియన్ రైల్వే అరుదైన రికార్డు..!
            ప్రపంచ రైల్వే వ్యవస్థ లో భారత్ ది కూడా  అతిపెద్ద రైల్వే వ్యవస్థ లలో ఒకటి.. ఇండియన్ రైల్వే వ్యవస్థ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. కరోనా మహమ్మారి భారత్ లో లేక ముందు వరకు దేశం లో నిత్యం పదమూడు వేల రైళ్లు నడుస్తూ ఉండేవి.. అయితే.. కరోనా మహమ్మారి వ్యాధి వ్యాప్తి ని నివారించేందుకు పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేవలం 230 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి.
 
            మార్చి 22 వ తేదీ నుంచి ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. అయితే.. ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లు.. శ్రామిక రైళ్లు వలస కార్మికులను తరలించడం లో విశేషమైన కృషి ని చేస్తున్నాయి. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సాధారణ రైళ్లను నిలిపివేశారు. కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. గతం లో ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడిచేటప్పుడు.. రైల్వే స్టేషన్ లో ఖాళీ లేకపోవడం లేదా ఇతర కారణాల వలన రైళ్లు ఆలస్యం గా వచ్చేవి.. అయితే.. ప్రస్తుతం తక్కువ సంఖ్యలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో ఒక్క రైలు కూడా ఆలస్యం కాకూడదని.. నిర్ణయించిన సమయానికి గమ్యస్థానానికి చేరుకోవాలని రైల్వే  శాఖ  ఆదేశాలు జారీ చేసింది. జూన్ 23 వ తేదీన దాదాపుగా అన్ని రైళ్లు సమయానికి చేరుకున్నాయి.. ఒక్క రైలు మాత్రం కొద్దిపాటి ఆలస్యానికి కారణమైంది. అయితే, గురువారం రోజున అన్ని స్పెషల్ రైళ్లు 100శాతం ఖచ్చితమైన సమయానికి గమ్యస్థానానికి చేరుకున్నాయని, ఇండియన్ రైల్వే చరిత్రలో ఇది అరుదైన విషయం అని  ఇటీవల రైల్వే శాఖ ప్రకటించింది. అయితే.. కరోనా మహమ్మారి బెడద వదిలిన తరువాత.. సాధారణ రైళ్లను కూడా నడపడం ప్రారంభించిన తరువాత.. అన్ని రైళ్లు నిర్దిష్ట సమయం లో స్టేషన్ కు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ ఆదేశించింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox