Breaking News

హీరో ప్రభాస్ కారుకు ఫైన్ విధించిన పోలీసులు

16 th Apr 2022, UTC

Hyderabad Traffic police impose fine to Hero Prabhas car :   కార్లకు బ్లాక్ ఫిల్మ్‌, ప్రజా ప్రతినిధుల పేరుతో సిక్కర్లు అంటించి వాటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న తరుణంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొద్దిరోజులుగా నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తుస్తున్నారు.

శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్‌ 36లో నీరుస్ జంక్షన్ వద్ద బ్లాక్‌ ఫ్రేమ్‌తో వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపారు.. ఆ కారును తనిఖీ చేయగా.. నటుడు ప్రభాస్‌ది అని తెలిసింది.ఈ క్రమంలోనే నంబర్ ప్లేట్‌ సరిగ్గా లేకపోవడం, కారుపై ఎంపీ స్టిక్కర్, విండోలకు బ్లాక్‌ ఫ్రేమ్‌ ఉండడంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1,450 ఫైన్ వేశారు. అయితే పోలీసులు జరిమానా విధించిన సమయంలో ప్రభాస్‌ కారులో లేడు.అతడి డ్రైవర్ మాత్రమే ఉన్నాడు.

సెలబ్రిటీలు  ప్రైవసీ  కోసమంటూ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వినియోగిస్తున్నారు. అయితే ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కార్లకు వున్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి వాటికి ఫైన్ విధించిన విషయం తెలిసిందే.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox