ఖగోళంలో ఎన్నిగ్రహాలున్నా చంద్రడు మానవులకు ప్రత్యేకం.చంద్రుడి వెన్నెలను కవులు తమ కవిత్వానికి ప్రేరణగా తీసుకుంటే సామాన్యులు దాన్ని అస్వాదిస్తారు. అటువంటి చంద్రుడిపై స్దలాన్ని ఒక భర్త తన భార్యకు కానుకగా ఇచ్చాడు. రాజస్తాన్ లోని అజ్మీర్ కు చెందిన ధర్మేంద్ర అనిజా , సప్నా అనిజ దంపతులు డిసెంబరు 24న తమ వివాహ ఎనిమిదో వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను ఎంతగానో ప్రేమించే భార్య కోసం ఏదైనా అద్భుతమైన బహుమతి ఇవ్వాలని ధర్మేంద్ర ఆలోచించారు.
ధర్మేంద్ర అనిజ మాట్లాడుతూ, తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన ప్రేయసికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకున్నానన్నారు. చాలా మంది ఈ భూమి మీద ఉన్న కార్లు, బంగారం వంటి వాటిని బహుమతులుగా ఇస్తూ ఉంటారని, అందువల్ల ఏదైనా ప్రత్యేకత చూపించాలని అనుకున్నానన్నారు. అందుకే చంద్రునిపై మూడెకరాల స్థలాన్ని కొన్నానని చెప్పారు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ స్థలాన్ని కొన్నానని, దీనికి అవసరమైన ప్రక్రియ పూర్తి కావడానికి ఒక సంవత్సరం పట్టిందని చెప్పారు.
సప్నా అనిజ మాట్లాడుతూ, తనకు తన భర్త అనూహ్యమైన బహుమతి ఇచ్చారని చెప్పారు. ప్రపంచానికి అతీతమైన బహుమతిని తన భర్త నుంచి తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పారు. చంద్రునిపై స్థలాన్ని బహుమతిగా పొందడం తనకు చాలా సంతోషకరమని చెప్పారు. తన భర్త ఇంత గొప్ప బహుమతి తనకు ఇస్తారని ఊహించలేదన్నారు. ప్రొఫెషనల్ ఈవెంట్ ఆర్గనైజర్లతో వైభవంగా ఏర్పాట్లు చేయించి, పార్టీ ఇచ్చినట్లు తెలిపారు. .

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021
15 Jan 2021