Breaking News

భద్రాద్రి రామయ్య పేరు మీదే నకిలీ అకౌంట్..!

25 th Jun 2020, UTC

కలి కాలం.. సందు దొరికితే.. ఎదో విధం గా మోసం చేసి డబ్బు సంపాదించేద్దాం అనుకుంటారు.. అయితే.. ఏకం గా భద్రాద్రి రామయ్యకే ఎసరు పెట్టాడు ఓ ప్రబుద్దుడు.. భద్రాద్రి రామయ్య పేరిట ఫేక్ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ భక్తుడు డబ్బు లు చెల్లించి తరువాత ఐఎఫ్ఎస్సి కోడ్ ను పరిశీలించడం తో ఈ ఘటన బయటకు వచ్చింది. ఆ భక్తుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
 
                వివరాల్లోకెళితే.. వరంగల్‍కు చెందిన కుంచాల సదా విజయ్​కుమార్​ ఇటీవల ఆన్​లైన్​లో భద్రాచలం రామాలయం వీకీ పీడియాను చూసారు. అందులో ఉన్న లింక్ ద్వారా  భద్రాచలం రామాలయం వెబ్‍సైట్‍ కు చేరుకున్నారు. ఆ వెబ్ సైట్ ఓపెన్‍ చేసి ఆన్‍లైన్లో పూజ చేయించుకునేందుకు..అక్కడ ఇవ్వబడిన గూగుల్ పే ఫోన్ నెంబర్ కు రూ.500 ట్రాన్స్​ఫర్ ​చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తరువాత ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍ ని  బట్టి ఆయన ఆ అకౌంట్ ఎవరిదో చూసారు. ఆ నెంబర్ ప్రకారం ఆ అకౌంట్ జనగామ జిల్లా పాలకుర్తి ఎస్బీహెచ్‍ శాఖ అని తేలింది. దీనితో.. ఆయన తాను మోసపోయానని అర్ధం చేసుకున్నారు. వెంటనే.. ఆయన ఓ పొలిసు అధికారి సాయం తీసుకుని అసలు విషయాన్నీ కూపీ లాగారట.
 
                  ఆయన పాలకుర్తి పోలీసుకు సమాచారం ఇవ్వడంతో ఫోన్‍ నంబర్‍ ఆధారంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.  ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ ఫోన్  నెంబర్ గల యువకుడు భద్రాద్రి రామాలయం పేరుతొ ఓ  ఫేక్ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి ఇలా మోసం చేస్తున్నాడు అని నిర్ధారణ కి వచ్చారు. ఈ విషయాన్నీ బుధవారం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో గదరాజు నర్సింహుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పూర్తి ఆధారాలతో భద్రాచలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సింది గా  ఈవో సిబ్బందిని ఆదేశించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox