Breaking News

కరోనా ఇద్దరిని ఒక్కటిగా చేసింది..!

28 th Jul 2020, UTC
కరోనా ఇద్దరిని ఒక్కటిగా చేసింది..!
 
కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. వ్యాపారాలు, ఉద్యోగాలు పోయి ఆర్దిక వ్యవస్ద నాశనమవడం.. భౌతిక దూరాలంటూ ఒకరికి ఒకరు దూరంగా వుండటం.. మాస్కులు, శానిటైజర్లు నిత్య జీవితంలో భాగం కావడం జరిగిపోయాయి. కనీసం పక్కింటివారితో కూడ సన్నిహితంగా మసల లేని, మాట్లాడలేని పరిస్దితిని ఈ వైరస్ తెచ్చిపెట్టింది. 
 
 అయితే ఇదే కరోనా వైరస్ ఇద్దరిని వివాహ బంధంతో ఒక్కటయ్యేలా చేసింది. కరోనా చికిత్స కోసం 
ఆస్పత్రిలో చేరిన ఇద్దరి మనసులను కలిపింది. దీనికి సంబంధించి వివరాలివి..
 
ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా పాజిటివ్ తేలడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు.. పక్క, పక్కనే బెడ్లు.. ఇద్దరూ  ధైర్యంగా ఆ మహమ్మారిని జయించారు.ఇదిలా ఉంటే ఆస్పత్రిలో బెడ్‌లు పక్కపక్కనే కావడంతో వీరిద్దరి మధ్య ముందు మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిసి ప్రేమగా మారింది. 
 
అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌. అమ్మాయి కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అంతేకాదండోయ్ ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే. కరోనా నుంచి కోలుకోవడంతో మళ్లీ టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పారు. తాము ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేయమని కోరారు.
 
ఇద్దరూ ఒకే సామాజిక వర్గం అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తుండటంతో అమ్మాయి తరపు కుటుంబ పెద్దలు పెళ్లికి ఓకే చెప్పారట. ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి వారం, పదిరోజుల వ్యవధిలోనే ప్రేమ పుట్టి పెళ్లిగా మారింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox