కరోనా లాక్ డౌన్ విధించిన తొలినాళ్లలో మన కాలర్ ట్యూన్ అందరికి ఒకటే వినిపించేది గుర్తుందా..? ‘‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. జాగ్రత్త వహించండి. అత్యవసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లాలి. ముక్కు, మూతిపై మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి’’.. అంటూ కాలర్ ట్యూన్ లో వినిపించేది. ఆ తరువాత ఈ ట్యూన్ ని మార్చేశారు. ‘అన్ లాక్ ప్రక్రియ మొదలైపోయింది’ అంటూ మరో ట్యూన్ ను కొన్నాళ్ళు ఉంచారు. తాజాగా, ఈ ట్యూన్ ను తీసేసారు. ఈ స్థానం లో మరో కొత్త ట్యూన్ ను పెట్టారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి తెలుపుతూ ఈ ట్యూన్ సాగుతుంది.
శుక్రవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ యావత్ దేశం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భం గా, వ్యాక్సినేషన్ ప్రక్రియను గురించి కాలర్ ట్యూన్ ను పెట్టబోతున్నారు. ఇక నుంచి మనం ఎవరికైనా కాల్ చేస్తే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కు సంబంధించిన కాలర్ ట్యూన్ వస్తుంది.
"కరోనా అంతానికి టీకా రూపంలో కొత్త సంవత్సరం ఓ కొత్త వెలుగును తీసుకొచ్చింది. దేశంలో తయారైన వ్యాక్సిన్లు సురక్షితమైనవి. ప్రభావవంతమైనవి. కరోనాను ఎదుర్కొనేందుకు వాటి నుంచి రోగ నిరోధక శక్తి వస్తుంది. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచండి. మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి. లేనిపోని వదంతులను నమ్మకండి" అంటూ ఈ కొత్త కాలర్ ట్యూన్ సాగనుంది.

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021