Breaking News

కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధం..!

26 th Jun 2020, UTC
కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధం..!
భారత్ కు చైనా కు మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. చైనా దొంగ ఎత్తుగడలు వేయడం వల్లే భారత్ ఇరవై జవాన్లను కోల్పోయింది. ఈ ఘర్షణలో చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించలేదు. వారిలో తెలంగాణ, సూర్యాపేట కు చెందిన కల్నల్ సంతోష్  బాబు కూడా ఒకరు.. ఇటీవలే ఆయనకు సకల సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేసారు. ఆ తరువాత.. సీఎం కెసిఆర్ సూర్య పేట లో సంతోష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని కూడా కలిసిన సంగతి తెలిసిందే..సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల భారీసాయం ప్రకటించారు. ఇటీవల సీఎం కేసీఆర్ సూర్యాపేటలోని సంతోష్ బాబు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు.
 
           ఈ నేపధ్యం లో.. సూర్య పేట లో కల్నల్ సంతోష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సింది గా తెలంగాణ ప్రభుత్వం భావించింది. సంతోష్ బాబు గౌరవార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సూర్యాపేటలోని పాత బస్టాండ్ జంక్షన్లో  ఆయన విగ్రహాన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శిల్పులు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఇప్పటికే విగ్రహ నిర్మాణం పూర్తి అయింది.త్వరలోనే సూర్యాపేట పాత బస్టాండ్ జంక్షన్ వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox