Breaking News

68 వ పడిలోకి సీఎం కేసీఆర్.. ఘనం గా వేడుకలు..!

17 th Feb 2021, UTC

నేడు సీఎం కేసీఆర్ 68 వ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు భిన్నం గా నిర్వహిస్తున్నారు. గత వారం రోజులనుంచి పార్టీ నేతలు ఏర్పాట్లలో ఉన్న సంగతి తెలిసిందే. తెరాస నాయకులూ తమ తమ నియోజక వర్గాలలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. నేటితో అవి పూర్తి అవుతాయి. తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించింది.

మరో వైపు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, రోగులకు పండ్లు పంచడాలు, రక్తదాన శిబిరాలు, వీల్ చైర్ల పంపిణి వంటి సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తం గా కోటి మొక్కలను నేడు నాటనున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రం లో ఉన్నారు.

ఈరోజు మధ్యాహ్నం ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి నేతలందరినీ పలకరించనున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భం గా మంత్రి హరీష్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కారణజన్ముడంటూ కీర్తించారు. ఆయన వల్లనే ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని కొనియాడారు. ఆయన్ను తెలంగాణ కు దేవుడిచ్చిన బహుమతి గా పేర్కొన్నారు. ఆయనకు పలువురు రాజకీయ నాయకులు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox