Breaking News

అమ్మకానికి చేగువేరా ఇల్లు..!

26 th Jun 2020, UTC
అమ్మకానికి చేగువేరా ఇల్లు..!


విప్ల‌వ‌ యోధుడు  చే గువేరా గురించి  తెలియని వారుండరు. చే ప్ర‌సంగాలు, అత‌ని ఆలోచ‌న‌లు యువ‌త‌రానికి ఇప్ప‌టికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మే. 1928లో అర్జెంటీనాలోని రోసారియోలో నియో క్లాసిక‌ల్ భ‌వ‌నంలో చే గువేరా జ‌న్మించాడు. 2002లో ఫ్రాన్సిస్కో ఫ‌రూగియా ఈ భ‌వ‌నాన్నికొనుగోలు చేశాడు.

 240 చ‌.మీ అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భ‌వ‌నాన్ని అత‌డు సాంస్కృతిక నిల‌యంగా మార్చుదామ‌నుకున్నా అది సాధ్య‌ప‌డ‌లేదు. దీంతో ఇప్పుడు దీన్ని అమ్మివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే ధ‌ర మాత్రం వెల్ల‌డించలేదు. ఇక‌ ఉర్కిజా, ఎంట‌ర్ రియాస్ మ‌ధ్య ఉన్న ఈ భవ‌నం ఏళ్ల త‌ర‌బ‌డి ఎంద‌రో ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తూ వ‌స్తోంది.


 వృత్తిప‌రంగా డాక్ట‌ర్ అయిన చే గువేరా రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు, సిద్ధాంతకర్త, మాన‌వ‌తావాది కూడా. దోపిడీ విధానాల‌ను నిర‌సిస్తూ అత‌డు క్యూబా విప్ల‌వంలో పాల్గొని ప్రాణాలకు తెగించి పోరాడాడు. అనంత‌రం ఫిడేల్ క్యాస్ట్రో ప్ర‌భుత్వంలో క్యూబా మంత్రిగా ప‌ని చేశాడు

. అయితే బొలీవియాలో పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ప‌ద‌వి వీడి మ‌ళ్లీ ఉద్య‌మం బాట ప‌ట్టాడు. ఈ క్ర‌మంలో 1967 అక్టోబ‌ర్ 9న బొలివీయ‌న్ ద‌ళాలు చేను చుట్టుముట్టి చంపేశాయి. అనంత‌రం ఆయ‌న మృతదేహాన్ని ప్ర‌పంచానికి కూడా చూపించ‌లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox