Breaking News

సినీ నిర్మాణంలోకి భూమా అఖిలప్రియ ?

26 th Jun 2020, UTC
సినీ నిర్మాణంలోకి భూమా అఖిలప్రియ ?

ఏపీ మాజీ టూరిజమ్ శాఖా మంత్రి భూమా అఖిల ప్రియ సినిమా ఫీల్డ్ వైపు చూపు సారించారా? అంటే అవుననే తెలుస్తోంది.. 2014లో ఆళ్ళగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ తరుపున ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ తరువాత టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రి పదవిని దక్కించుకున్నారు.

గత కొద్ది కాలంగా అఖిలప్రియకు రాజకీయాలు అచ్చిరాలేదు. అఖిలప్రియ 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది.

ఈ ఎన్నికల తరువాత ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ హవా తగ్గడం,భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చడానికి అఖిల ప్రియ స్కెచ్ వేసిందనే వార్తలతో ఆమె  వివాదాల్లో చిక్కుకున్నారు.

మరో వైపు అధికార పార్టీ టీడీపీ నేతల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుండటంతో భూమా అఖిల ప్రియ రాజకీయాలను కొనసాగిస్తూనే సేఫ్ జోన్‌గా సినిమా రంగం వైపు చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తన భర్త భార్గవ్ నాయుడు తో కలిసి మూవీ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తొలి నుంచి భూమా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండనే ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని అఖిల ప్రియ నిర్మాణ రంగంలో అడుగుపెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.  2019 ఎన్నికల తరువాతే నిర్మాణ సంస్దను ఏర్పాటు చేయాలని  భావించినా ఆలస్యం అయింది.  తరువాత కరోనా ఎఫెక్ట్ తగలడంతో ప్రస్తుతానికి ఆమె ప్రయత్నానికి బ్రేక్ పడింది. చూడాలి మరి  భూమా అఖిల ప్రియ సినిమా రంగంలో  ఎలా రాణిస్తారో చూడాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox