Breaking News

రైతు అవతారమెత్తిన నవాజుద్దీన్ సిద్దిఖీ..!

24 th Jun 2020, UTC
రైతు అవతారమెత్తిన నవాజుద్దీన్ సిద్దిఖీ..!

కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన సెలబ్రిటీలు తమకిష్టమైన పనులు, వ్యాపకాల్లో మునిగితేలారు. మరి కొంతమంది వలస కూలీలకు సాయం చేసారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇవన్నీ నెటిజన్లకు చేరాయి. ఇపుడు తాజాగా  బాలీవుడ్‌  విలక్షణ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ రైతుగా మారారు. తన సొంత ఊరిలో వ్యవసాయం చేస్తున్నారు.

 నవాజుద్దీన్ కు  వ్యవసాయమంటే చాలా ఇష్టం. తన వ్యవసాయ క్షేత్రంలోని పచ్చని పొలాల్లో పనిచేసిన సిద్ధిఖీ, కాలువలోని నీటితో చేతులు శుభ్రం చేసుకుంటూ కనిపించారు. తలకు కండువా కట్టుకుని.. భుజంపై పార పెట్టుకుని ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సిద్ధిఖీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈరోజుకి పని పూర్తయింది..’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

 నవాజుద్దీన్‌ సిద్దిఖీ సొంతూరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌. అతడి సోదరి ఇటీవల మరణించడంతో ప్రభుత్వ అనుమతులు తీసుకుని అంత్యక్రియలకు హాజరయ్యాడు. అనంతరం 14 రోజుల క్వారైంటన్‌ పూర్తి చేసుకుని సొంతూరిలో రైతుగా మారిపోయాడు.

తన తల్లి కోసమే ప్రస్తుతం అక్కడ ఉంటున్నట్టు సిద్ధిఖీ ఇదివరకే తెలిపారు. నవాజ్ భార్య ఆలియా అతనికి విడాకుల నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే దానిపై అతను ఇంకా స్పందించలేదు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox