Breaking News

అటవీ భూమి ని దత్తత తీసుకున్న డార్లింగ్..!

07 th Sep 2020, UTC

టాలీవుడ్:  డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుని తన సామాజిక స్పృహను కూడా చాటుకున్నారు. హైద్రాబాదులోని ఖాజీ పల్లి వద్ద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను ప్రభాస్ దత్తత తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాలుపంచుకున్నారు. ఇందులో భాగంగానే, ఆయన  ఓ 1000 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మొదలుపెట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే. ఖాజీపల్లి అర్బన్ బ్లాక్ ను దత్తత తీసుకున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ హాజరు అయ్యారు. 1650 ఎకరాల అటవీభూమిని డార్లింగ్ దత్తత తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ భూమి జిన్నారం మండలం ఓఆర్ఆర్ సమీపంలో వుంది. కాగా, ఈ భూమిని ప్రభాస్ తన తండ్రి దివంగత యూవీఎస్ రాజు పేరుమీద అర్బన్ పార్క్, అటవీప్రాంతంగా అభివృద్ధి చేయాలనీ భావిస్తున్నారు. ఇప్పటికే ఇందుకోసం రెండు కోట్లు ప్రభాస్ కేటాయించారు. అవసరం అయితే, మరింత ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. (మరిన్ని సినిమా వార్తలు చదవండి. )

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox