Breaking News

 మైక్రోసాఫ్ట్‌లో పెర్మనెంట్ గా వర్క్ ఫ్రం హోమ్

10 th Oct 2020, UTC

మైక్రోసాఫ్ట్:  టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వర్క్‌ ఫ్రం హోంను ఇకపై శాశ్వతంగా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు  ప్రకటించింది. అయితే ఈ అవకాశం కొన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. మహమ్మారి బారిన ఉద్యోగులు పడకకుండా ఉండేందుకు పలు ఐటీ కంపెనీలతో సహా ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. 

అయితే మైక్రోసాఫ్ట్‌ తన ప్రకటనలో హర్డ్‌వేర్‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాలలో పని చేస్తోన్న ఉద్యోగులు మినహా ఇతర విభాగాల్లో పని చేసే ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. అలా చేయాలనుకుంటున్న ఉద్యోగులు ఆయా విభాగాలకు చెందిన తమ మేనేజర్లతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వారి నివాస స్థలాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఆమెరికాలో పని చేస్తున్న విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లి పని చేసుకోవచ్చని స్ఫష్టం చేసింది. అంతేగాక అమెరికాలోని ఉద్యోగులు కుడా సొంత ప్రదేశాలకు వెళ్లోచ్చిన చెప్పింది. అయితే వేతనాల్లో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయని, ఇందుకోసం మేనేజర్‌ నుంచి అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox