Breaking News

ట్రెండింగ్ లో ఉన్న గంగవ్వ..!

07 th Sep 2020, UTC
ట్రెండింగ్ లో ఉన్న గంగవ్వ..!

బుల్లితెర :బిగ్ బాస్ సీజన్ 4 సందడి మొదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి పాల్గొబోతున్న పదహారు కంటెస్టెంట్స్ లో ఎక్కువ పాపులారిటీ గంగవ్వకే వచ్చేసింది. అచ్చ తెలంగాణ యాసతో యుట్యూబ్ ద్వారా యువత మనసు గెలుచుకున్న గంగవ్వ అందరికి సుపరిచితమే. అయితే, ఆమె కూడా బిగ్ బాస్ లో పాల్గొంటోంది అన్న విషయం తెలియగానే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆమె ఎంట్రీ పై సోషల్ మీడియాలో అనేక మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

యుట్యూబ్ కంటే ముందు గంగవ్వ ఓ మారు మూల గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ ఉండేది. ఓ యుట్యూబర్ సరదాగా గంగవ్వను కెమెరా ముందుకు  తీసుకొచ్చాడు. అలా పరిచయం అయిన గంగవ్వ కామెడీ స్కిట్ లు చేస్తూ యువతకు మరింత దగ్గరయింది. ఆమెకు ఎనలేని పాపులారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ అనౌన్స్ లిస్ట్ బయటకు రాగానే, అందరికి వందల్లో, వేలల్లో లైక్ లు పెరిగాయి. కానీ గంగవ్వకు మాత్రం ఏకంగా పదిహేను వేల లైక్ లు వచ్చేసాయి.

అంతే కాదు. మరో వైపు ట్విట్టర్ లో కూడా గంగవ్వ ట్రెండింగ్ లోనే ఉంది.ఇంకా బిగ్ బాస్ షో టెలికాస్ట్ కాకుండానే గంగవ్వకు వేలల్లో ఫాన్స్ పెరిగిపోయారు. షో టైంలో గంగవ్వను ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని కూడా సోషల్ మీడియా లో నెటిజన్లు హెచ్చరించేస్తున్నారు. మరో వైపు నాగార్జున కూడా గంగవ్వను జాగ్రత్తగా చూసుకోవాలని, ఏదైనా ఇబ్బంది పెడితే  ట్రబుల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని వర్కింగ్ కూడా ఇచ్చేశాడట. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox