Breaking News

బుట్టబొమ్మ సాంగ్ కు 300 మిలియన్ వ్యూస్

02 nd Aug 2020, UTC
బుట్టబొమ్మ సాంగ్ కు 300 మిలియన్ వ్యూస్

టాలీవుడ్ :  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం అల వైకుంఠ పురంలో. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు స్దాయి కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఎంత విజయవంతం అయిందో ఇందులో పాటలు కూడ మ్యూజికల్ గా అంత హిట్టయ్యాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ సంచలనం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూవ్యూస్, లైక్స్ అంటూ రోజూ ఏదో ఒక రికార్డ్ వార్త ఈ పాట గురించి వినిపిస్తూనే ఉంది.

తాజాగా ఈ సాంగ్ 300 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టినట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్డ్రీకి సంబంధించి ఏ పాటకు ఇంత క్రేజ్ రాలేదు. టిక్ టాక్ వంటి మాధ్యమాలతో ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో కూడా వినబడింది. థమన్ సంగీతం, రామజోగయ్య సాహిత్యానికి బన్నీ డ్యాన్స్ తోడవడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ పాటను అద్బుతంగా చిత్రీకరించారు.

అందుకే యూట్యూబ్‌లో ఈ సాంగ్ విపరీతంగా క్రేజ్ అవుతోంది. ఇప్పుడీ పాట 300 మిలియన్ క్లబ్‌లోకి చేరి తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి చాటిచెప్పింది.

మరిన్ని సినిమా వార్తలు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox