ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు భగవానుడి విగ్రహం. మన దేశంలో లేదు.. కానీ ఇండోనేషియాలో ఉంది.
అంతేకాదు.. ఈ విగ్రహాన్ని రాగి, ఇత్తడితో నిర్మించారు. ఈ విగ్రహం నిర్మించడానికి దాదాపు 24 సంవత్సరాలు పట్టింది.
బాలీ ద్వీపంలోని ఉంగాసన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం నిర్మాణం వెనుక ఒక కల ఉంది.
1979లో ఇండోనేషియాలో నివసించే శిల్ప బప్పా సుమన్ నువర్తా ఒక భారీ విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడట.
ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు. సుధీర్ఘ కాలం ప్రణాళిక చేసి.. అందుకు కాస్త డబ్బు పొగేసి 1994లో విగ్రహ నిర్మాణం ప్రారంభించారు.
అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ మహా విష్ణువు విగ్రహాన్ని సందర్శించారు.
విష్ణు మూర్తి విగ్రహాన్ని నిర్మించిన బప్పా నుమాన్ భారతదేశంలో కూడా గౌరవించబడ్డారు. దేశ అత్యున్నత పౌర సన్మానాలలో ఒకటైన పద్మ శ్రీతో సత్కరించారు.