జపాన్ కు చెందిన ఓ ప్రముఖ ఐస్ క్రీమ్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘బైకుయా’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ లీ ఐస్ క్రీమ్ తయారు చేసింది.
ఈ ఐస్ క్రీమ్ బాగా సాఫ్ట్ గా ఉండటమే కాకుండా సరికొత్త రుచిని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇంతటి స్పెషల్ ఐస్ క్రీమ్ ను తినేందుకు ప్రత్యేకంగా ఓ మెటల్ స్పూన్ ను డిజైన్ చేసింది కంపెనీ.
ఈ ఐస్ క్రీం అంత కాస్ట్ లీ ఎందుకంటే.. అందులో వాడిన పదార్థాలే కారణం. ప్రొటీన్ రిచ్ గా తయారైన ఈ ఐస్ క్రీమ్ లో రెండు రకాల చీజ్, గుడ్లు, సాక్ లీక్ పదార్థాలను ఉపయోగించారు. వీటిని పాలతో తయారు చేసిన వెల్వెట్ బేస్ లో (కోన్ ) ఉంచుతారు.
ఈ మిశ్రమంపై మరో రకమైన చీజ్, అత్యంత అరుదుగా దొరికే వైట్ ట్రపుల్, ట్రపుల్ ఆయిల్, తినే బంగారు రేకులతో గార్నిష్ చేస్తారు.
ఇందులో ఉపయోగించే వైట్ ట్రపుల్ చాలా ప్రత్యేకమైందట. అది ఇటలీలో దొరుకుతుంది. అక్కడి నుంచే సేకరించారు.
ఐస్ క్రీమ్ ను తినేందుకు ప్రత్యేకంగా ఓ మెటల్ స్పూన్ ను డిజైన్ చేసింది కంపెనీ. పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణంలో వాడే పద్దతులు, సామగ్రితో ఆ స్పూన్ ను తయారు చేశారు.
ఈ ఐస్ క్రీమ్ కు ఎక్స్ పైరీ డేట్ లాంటిది ఉండవని.. కానీ, 10 రోజుల్లోపు తింటే ఐస్ క్రీమ్ రుచి తాజాగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.
ఈ ఐస్ క్రీమ్ ధర చెప్పలేదు కదా. 130 మిల్లీ మీటర్ల ‘బైకుయా’ ధర సుమారు రూ. 5 లక్షలు. అవును మరి ప్రపంచంలోనే ఖరీదైంది అంటే ఆ మాత్రం ఉండాలి కదా.