మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1967లో ప్రారంభిస్తే ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి పన్నెండుసార్లు ఎన్నికలు జరిగాయి.

అత్యధిక సార్లు గెలుపొందిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది

ఇదే నియోజకవర్గంలో సీపీఐ సైతం ఐదుసార్లు విజయాన్ని సొంతం చేసుకుంది.

1967 నుంచి 1985 వరకు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి విజయం సాధించారు.

1985 నుంచి సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

1999లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి మరోసారి గెలవగా 2009లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి ఉజ్జిని యాదగిరిరావు విజయాన్ని సాధించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వేళలో జరిగిన ఎన్నిక (2014)లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.

2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.