పెళ్లయిన కొత్తజంట వెళ్లే విహారయాత్రను హనీమూన్ అంటాం. ఇందులో చాలా రకాలున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం
సముద్రతీరంలో ఏకాంతంగా గడపాలని కోరుకునే వారు బీచ్ హనీమూన్ ను ఎంచుకుంటారు.
అడ్వెంచర్ ని ఇష్టపడే వారు అడ్వెంచర్ హనీమూన్ కి వెళ్తారు. స్కైయింగ్, రాక్ క్లైంబింగ్, వంటి సాహసోపేత క్రీడలుండే ప్రాంతాలకు వెళ్తారు.
కొత్తకొత్త రుచుల్ని చూడాలనుకునే వ్యక్తులు తమ భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లి కొత్త రుచుల్ని టేస్ట్ చేస్తుంటారు. దీన్ని గౌర్మెట్ హనీమూన్ అంటారు
యూ ఓన్లీ లివ్ వన్స్, యోలో హనీమూన్ అని కూడా అంటారు. ఈ అవకాశం మళ్లీ రాదు అంటూ ఎంత ఖర్చయినా వెనకాడకుండా విదేశాలకు హనీమూన్ కోసం వెళ్తారు
సమయం డబ్బు లేని జంటలు చేసుకునే మినీ హనీమూన్ ఇది. అందుకే దీన్ని మినీమూన్స్ అంటారు. తక్కువ ఖర్చుతో దగ్గర్లో ఉండే పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు
కొన్ని జంటలు రద్దీగా ఉండే నగరాల్లో రోజంతా చక్కర్లు కొట్టి రాత్రుళ్లు ఏకాంతాన్ని కోరుకుంటారు. అలాంటి వారు ఈ అర్బన్ హానీమూన్ కి వెళ్తారు
జంటగా ఏవైనా మంచి పనులు చేయాలనుకునే వారు ఈ వాంటరీ హనీమూన్ కి వెళ్తుంటారు. వృద్ధులకు అనాథలకు సేవ చేయడం, వ్యవసాయం చేయడం వంటివి చేస్తారు
ఫోన్లు ల్యాప్ టాప్, గ్యాడ్జెట్లను ఇంట్లోనే వదిలేసి వాటికి దూరంగా ఏకాంతంగా గడపాలనుకునే వారు ఈ డిజిటల్ డిటాక్స్ హనీమూన్ కి వెళ్తారు. ఈ సమయంలో వారు అస్సలు డిజిటల్ వస్తువుల్ని ముట్టుకోరు
పెళ్లైన వెంటనే కొంతమందికి హనీమూన్ కి వెళ్లే వీలుకుదరదు. అలాంటి వారు ఆలస్యంగా అయినా సరే విహారయాత్రకు వెళ్తే దాన్ని లేట్ హనీమూన్ అంటారు.