ఆలివ్ నూనె

ఎక్ట్రావర్జెన్ ఆలివ్ ఆయిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీనిని అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. దీనిని ముఖ్యంగా బ్రెడ్ డిప్గాను సలాడ్ డ్రెస్సింగ్లోనూ ఉపయోగిస్తారు.

ఆవనూనె

ఆవాల నుంచి తయారైన ఈ నూనె ఒమేగా-2 మరియు ఒమేగా-6 ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి మరియు కీళ్లు  కండరాలు మరియు గుండె సంబంధిత వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.

అవకాడో ఆయిల్

దీనిలో ముఖ్యంగా ఒమేగా-9 ఫాటీ ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని మరిగించిన నూనె కంటే కూడా పచ్చిగానే ఆహారపదార్థాలలో ఉపయోగించి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. 

కానోలా ఆయిల్

దీనిలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మెండుగా ఉంటాయి. విటమిన్ E మరియు K పోషకాలను కలిగి ఉంటుంది. ఇది బరువును తగ్గించడానికి.. హృదయనాళాలు సంబంధిత రోగాలను దూరం చెయ్యడంలో ఎంతో తోడ్పడుతుంది.

అవిసెగింజల నూనె

దీనిలో పొటాషియం ఒమేగా -6 మరియు-3 ఫాటీ ఆమ్లాలు మెండుగా ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమల సమస్యలను దూరం చెయ్యవచ్చు. మరియు జీర్ణక్రియ సమస్యలు దూరం అవుతాయి మరియు హృదయ సంబంధ రోగాలను దరిచేరనివ్వదు. 

వాల్నట్ ఆయిల్

దీనిలో ఒమేగా-3, 6 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ పెరుగుదలను ప్రేరేపిస్తుంది, గాయం నయం చేసే కణజాలాన్ని ప్రేరేపిస్తుంది.

రైస్ బ్రాన్ ఆయిల్

దీనిలో విటమిన్ E, మరియు అన్ శాచురేటెడ్ కొవ్వుల ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బాదం నూనె

దీనిలో  విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. మరియు మెగ్నీషియం పాస్పరస్ మరియు కాపర్ మూలకాలు మెండుగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ నూనె ఎంతగానో తోడ్పడుతుంది.

నువ్వుల నూనె

దీనిలో ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ E, ఒమేగా-3,6 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మరియు షుగర్ లెవెల్స్ ను కంట్లోల్లో ఉంచడానికి ఈ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది