శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

నేడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 81వ పుట్టిన రోజు

రాఘవేంద్రరావు మొత్తం ఎనిమిది నంది పురస్కారాలు, ఒక IIFA పురస్కారం, ఒక సైమా అవార్డు, ఐదు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు, రెండు సార్లు సినీ మా అవార్డులు అందుకున్నారు

దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం 1975లో వచ్చిన బాబు. ఈ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు.

ఎందరో స్టార్ హీరో హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా రాఘవేంద్రుడిదే

రొమాంటిక్ పాటలకే కాక భక్తిరస చిత్రాలకు  రాఘవేంద్రరావు పెట్టింది పేరు 

ఎన్టీఆర్ రాఘవేంద్రరావు అయితే టాలీవుడ్ నాట హిట్ పెయిర్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి కాంబోలో 12 సినిమాలు రాగ అందులో 10 సూపర్ హిట్స్ గా నిలిచాయి

అతిలోక సుందరి శ్రీదేవితోనూ రాఘవేంద్రరావు 24 సినిమాలు చేశారు.

కేవలం వెండితెరమీదే కాక బుల్లితెర మీద కూడా రాఘవేంద్రరావు తన ముద్ర వేశారు. శాంతి నివాసం అనే సీరియల్ కు రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు ఈ లెజెండ్రీ డైరెక్టర్.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం