జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. సినిమాల్లో ఆఫర్ల కోసం సోషల్ మీడియాలో సోకుల్ని ఎరగా వేస్తోంది.

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే యువ హృదయాలను గెలుచుకుంది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా ఈ హైదరాబాదీ అమ్మాయి పాపులారిటీ పెరిగింది. (Photo:Instagram)

తన గ్లామర్ తోనే కాకుండా.. కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది ఫరియా. మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి అగ్ర స్టార్ హిరో ప్రశంసలు అందుకోవడంతో ఇక ఈ బ్యూటీ తిరుగేలేదని అనుకున్నారంతా. కానీ ఊహించిన దానికి భిన్నంగా ఆమె కెరీర్ సాగిపోతోంది. (Photo:Instagram)

జాతిరత్నాలు తెచ్చిపెట్టిన క్రేజ్ అవకాశాలు తీసుకురాలేకపోతోంది. ఫరియాకి ఆశించిన అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మాస్ మహారాజ రవితేజ సినిమా మాత్రమే ఉంది. అది కూడా నలుగురు హీరోయిన్స్‌లో ఒకరిగా ఆమె నటిస్తోంది. (Photo:Instagram)

ఇందులో ఫరియా రోల్ స్పెషల్ గా ఉండనుందట. అదేవిధంగా 'వల్లి మెయిల్' అనే సినిమాలో నటిస్తోంది ఫరియా. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం బ్యూటీగా కూడా ఫరియా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె సాంగ్‌ పాపులర్ అయినప్పటికి అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు.(Photo:Instagram)

కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా నటించిన 'బంగార్రాజు' సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరికీ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.అయితే ఇప్పుడు ఈ అమ్మడికి మరో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కిందని తెలుస్తోంది.(Photo:Instagram)

అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న 'ఏజెంట్' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోందట ఫరియా అబ్దుల్లా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. ఏజెంట్ సినిమాలో ఓ మాస్ ఐటెం సాంగ్ ఉంటుంది.(Photo:Instagram)

ఈ మాస్ సాంగ్‌కు పలువురు పేర్లు పరిశీలించిన మేకర్స్ చివరకు ఫరియాను తీసుకున్నారట. ఫరియా అబ్దుల్లా అయితేనే సరైన న్యాయం చేస్తుందని సెలక్ట్ చేశారని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ రానున్నట్టు తెలుస్తోంది. (Photo:Instagram)

ఈ సినిమాకు మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదే నిజమైతే అప్పుడు అన్న నాగ చైతన్యతో హుషారుగా స్టెప్పేసిన ఇప్పుడు తమ్ముడు అఖిల్ తో అంతకుమించిన హంగామా చేయనుందన్నమాట. (Photo:Instagram)

ఏదేమైనా ఈ ఆఫర్ ఫరియాకు దక్కాలే గానీ అమ్మడి కెరీర్‌కి మంచి బూస్టింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ క్వాలిటీస్ మెండుగా ఉన్నప్పటికి ఐటమ్ లేడీగానే ఫరియా అబ్దుల్లా ఫిక్స్ అవడం ఖాయం అనే టాక్ కూడా వినిపిస్తోంది. (Photo:Instagram)

అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న 'ఏజెంట్' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోందట ఫరియా అబ్దుల్లా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. ఏజెంట్ సినిమాలో ఓ మాస్ ఐటెం సాంగ్ ఉంటుంది.(Photo:Instagram)

జాతిరత్నాలు తెచ్చిపెట్టిన క్రేజ్ అవకాశాలు తీసుకురాలేకపోతోంది. ఫరియాకి ఆశించిన అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మాస్ మహారాజ రవితేజ సినిమా మాత్రమే ఉంది. అది కూడా నలుగురు హీరోయిన్స్‌లో ఒకరిగా ఆమె నటిస్తోంది. (Photo:Instagram)

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం