సీనియర్‌ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు

1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో శరత్‌బాబు హీరోగా పరిచయం అయ్యారు.

హీరోగా కాకుండా విలన్‌, సహాయనటుడిగా సుమారు 250 కు పైగా చిత్రాల్లో నటించారు.

శరత్‌బాబు సినిమాల్లోనే కాకుండా పలు సీరియల్స్‌తోనూ గుర్తింపు పొందారు. అప్పట్లో ఈటీవీలో వచ్చిన ‘అంతరంగాలు’సీరియల్ ఆయనకు టీవీ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసింది.

శరత్ బాబు నటి రమాప్రభను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా పెళ్లి అయిన కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు సుశీలాదేవిల కుమారుడు శరత్‌బాబు. ఆయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు.

అనుకోకుండా ఆయన నాటక రంగం వైపు వచ్చారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆయన ఎన్నో నాటకాలు వేశారు.

మరో చరిత్ర, గుప్పెడు మనసు, సీతాకోక చిలుక, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, సాగరసంగమం, సంసారం ఒక చదరంగం, ఇలా ఎన్నో సినిమాలు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

అప్పట్లో ఈటీవీలో వచ్చిన ‘అంతరంగాలు’సీరియల్ ఆయనకు టీవీ ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేసింది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం