సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌ ను ఒక గడ్డ లేదా ముద్ద ఆధారంగా గుర్తిస్తారు.

రొమ్ము నొప్పి, పరిమాణం లేదా ఆకృతిలో మార్పులు, చనుమొన ఉత్సర్గ, చర్మం మార్పులు, వాచిన శోషరస కణుపులు వంటి ఇతర సంకేతాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌ను తెలుపుతాయి

వయస్సు ఆధారంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం చేయాల్సిన టెస్టులు ఇవే

20-30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు క్రమం తప్పకుండా బ్రెస్ట్ సెల్ఫ్- ఎగ్జామినేన్‌ ప్రాక్టీస్ చేయాలి. ఏవైనా మార్పుల ఉన్నాయా లేదా అనేది గమనించాలి

31-40 ఏజ్ గలవారు ప్రతి ఆరు నెలలకు ఆంకాలజిస్ట్ ద్వారా క్లినికల్ పరీక్షలు చేయించుకోవాలి

41-55 వయసు ఉన్నవారు ఏడాదికి ఒకసారి మామోగ్రామ్‌ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

55 లేదా అంతకుమించి వయసు ఉన్నవారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మామోగ్రామ్ చేయించుకోవాలి.

ఫైబ్రోసిస్టిక్ మార్పులు లేదా రొమ్ము తిత్తులు వంటి వివిధ క్యాన్సర్ కాని పరిస్థితుల వల్ల కూడా రొమ్ములో గడ్డలు ఏర్పడవచ్చు.

రొమ్ము క్యాన్సర్ పురుషులను కూడా ప్రభావితం చేస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం