బలపం, చాక్ పీస్, మట్టి ఇలా ఏదో ఒకదాన్న కొంత మంది తింటారు

ఎంత వద్దనుకున్నా ఈ అలవాటును మార్చుకోలేరు వీటితో అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి

బలపం తినాలనే కోరిక పుట్టడానికి కారణం కాల్షియం లోపమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఇందులో సున్నం కలపడంతో అనేక ఇబ్బందులు వస్తాయని అంటున్నారు

బలపాన్ని రాతిపొడితో తయారు చేయడంతో దంతాలు బాగా దెబ్బతింటాయి. పంటిపై ఎనామిల్ పాడవుతుంది

బలపాల్లో కొన్ని రకాల కెమికల్స్ కలపడంతో అవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కడుపునొప్పి అన్నం జీర్ణం కాకపోవడం మలబద్ధకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి

ఆకలి మందగిస్తుంది ఏ పదార్థం తినాలనిపించదు. పొట్ట ఉబ్బుగా తయారవుతుంది.

అతిగా బలపాలను తినడంతో నోట్లో పుండ్లు వస్తాయి. నాలుక పగులుతుంది. పెదవులకు పగుళ్లు వస్తాయి

బలపం తినే వారికి కడుపులో నులిపురుగులు కూడా ఏర్పడుతాయి. మహిళలకు నెలసిరి చిక్కులు వస్తాయి. గర్భం దాల్చడం కష్టంగా ఉంటుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం